సోరియాసిస్, కీళ్ళనొప్పులు, చెవిలో హొరు 12051...India
63-సంవత్సరాల వయసుగల వ్యక్తి గత 10 సంవత్సరాలుగా సోరియాసిస్ తోనూ గత సంవత్సరంగా కీళ్ళనొప్పులతోను బాధపడుతున్నారు. వీరికి చేతిలో పుండ్లు, మరియు జాయింట్ల లో నొప్పులు కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా ఒళ్లంతా దురద కూడా ఉన్నది. వీరు కీళ్ళనొప్పులు నిమిత్తం అలోపతి మందులు (మిథోట్రెగ్జేట్ ) కూడా తీసుకుంటున్నారు.
2015 నవంబర్ లో వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC21.10 Psoriasis…TDS
నెల రోజుల పాటు రెమిడి తీసుకున్న తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది కానీ పేషంటుకు కుడి చెవిలో హోరు ప్రారంభ మయ్యింది. పేషంటు ఒక ENT నిపుణుడికి చూపించగా కుడి చెవి 70% వినికిడిని కోల్పోయినట్లు తెలిపారు. అందుచేత ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ని అదనంగా ఇవ్వడం జరిగింది:
#2. CC5.2 Deafness + CC5.3 Meniere’s disease + CC18.5 Neuralgia…TDS
#1 మరియు #2 తీసుకున్న నాలుగు నెలలలోనే సోరియాసిస్ మరియు కీళ్ళనొప్పుల నుండి 100% ఉపశమనం పొందినట్లు అలాగే చెవిహోరు నుండి 40% ఉపశమనం పొందినట్లు తెలిపారు. మెడికల్ రిపోర్టులో కీళ్ళ నొప్పి జాడ కూడా కానరాలేదు. కనుక వీరి డాక్టరు మీతోట్రెక్జేట్ ను 15mg నుండి 5mgకి తగ్గించారు. ప్రాక్టీషనర్ #1 యొక్క మోతాదు OD గానూ #2 ను TDS గానూ తగ్గించడం జరిగింది.
6 నెలల తర్వాత పేషంటు చెవిహొరు నుండి పూర్తిగా కోలుకున్నారు కనుక #2 ను OD కి తగ్గించడం జరిగింది. 2016 అక్టోబర్ లో పేషంటు పరీక్ష చేయించుకున్నప్పుడు వీరికి వినికిడి శాతం అద్భుతంగా మెరుగయినట్లు గతంలో ఉన్న70% నుండి 20% నకు చేరినట్లు ఫలితాలు తెలిపాయి. ఈ పురోగతి చూసి డాక్టర్ చాలా ఆశ్చర్యపడ్డారు. కీళ్ళ నొప్పులకు సంబంధించిన రిపోర్టులు కూడా నార్మల్ గా ఉన్నట్లే చూపిస్తున్నాయి. [ప్రస్తుతం వీరు #1 మరియు #2 లను ODగా తీసుకుంటున్నారు].