చెవిలో హూరు వలన వచ్చే తలదిమ్ము 12051...India
44 - సంవత్సరాల మహిళ చెవిలో హోరు వలన వచ్చే తలదిమ్ముతో ( పేషంటు యొక్క అలోపతి డాక్టర్ చేత సూచిoచబడింది ) 2 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. గత రెండున్నర నెలలుగా ఆమెకు తలతిరుగుడు తో పాటు వాంతి చేసుకున్నప్పుడు రక్తపు చుక్కలు కూడా కనబడుతున్నాయి. ఈమె తలదిమ్ముకు అలోపతి మందులు తీసుకున్నారు కానీ ఏమాత్రం ఫలితం ఇవ్వకపోవడంతో నైరాశ్యంలోకి వెళ్ళిపోసాగారు.
ఈమెకు 2016 జూలై నెలలో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది:
CC5.2 Deafness + CC5.3 Meniere’s disease + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.7 Vertigo…TDS నీటితో
వారం రోజులలోనే పేషంటు కు తలదిమ్ము నుండి 100% ఉపశమనం కలుగగా చెవిహోరు నుండి 80% ఉపశమనం కలిగింది. నెల రోజులలోనే ఆమెకు పూర్తిగా తగ్గిపోయింది కానీ రెమిడి ని TDS. కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. మూడునెలల తర్వాత మోతాదు OD కి తగ్గించి నెలరోజులు అనంతరం OW తీసుకోవడం ప్రారంభించారు. ఐతే ముందు జాగ్రత్త కోసం ఇప్పటికీ అనగా ఫిబ్రవరి 2018 నాటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. వైబ్రోతో తను పొందిన చికిత్స నుండి స్పూర్తిని పొంది అందరికీ ఈ మందులు వాడవలసినదిగా సూచిస్తున్నారు.