దీర్ఘకాలికమైన లింఫో ప్లాస్మా సైటిక్ సోరియాసిస్ 12051...India
నాలుగు సంవత్సరాల వయస్సు నుండి దీర్ఘకాలిక లింఫోప్లాస్మాటిక్ సోరియాసిస్ తో బాధపడుతున్న ఒక 9 ఏళ్ల బాలుడు తన అరచేతులపై మరియు కుడి మడమ మీద గాయాలు కలిగి ఉన్నాడు. దీనికి అదనముగా రెoడు గాయాలు వెనుక వీపు వైపు ఒకటి ఎడమకాలి మీద ఒకటి గాయాలు ఉన్నాయి. ఇతనికి వివిధ చర్మ నిపుణుల చేత సిఫారసు చేయబడిన అనేక వైద్య పరీక్షలు కూడా చేసారు. గత ఐదు సంవత్సరాలలో అనేక అల్లోపతిక్ మందులు మరియు ఆయింట్మెంట్ లను కూడా వాడారు.
కానీ ఏమాత్రం మెరుగుదల లేదు. జూలై 2016 లో, అభ్యాసకుడు బాబుకు క్రింది కాంబో ఇచ్చారు.
CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC12.4 Autoimmune diseases + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions…TDS మరియు ఆలివ్ ఆయిల్ ద్వారా పై పూతకు కూడా ఇవ్వబడింది.
ఈ బాబు ఒక మారుమూల ప్రదేశంలో నివసిస్తున్నందున, అతను తరచుగా అభ్యాసకుడిని సందర్శించలేకపోయేవాడు. అందుచేత మూడు నెలల తరువాత, అతను సందర్శించినప్పుడు 50% అభివృద్ధిని గమనించారు. బాలుడికి అదే రెమిడి కొనసాగించవలసిందిగా సూచించబడగా మూడునెలల తర్వాత తన తదుపరి సందర్శనలో, 70% మెరుగుదల కనిపించింది. చికిత్సను మరికొంత కాలము కొనసాగించగా ఆ సంవత్సరం ముగింపులో, అరచేతులు మరియు మడమ మీద 100% మెరుగుదల కనిపించింది (చిత్రాలు చూడండి). వెనుక మరియు కాళ్ళపై ఉన్న గాయాలు కూడా తగ్గిపోయాయి. రెండు నెలల పాటు మోతాదు BD కి తగ్గించబడి, తరువాత నాలుగు నెలలపాటు OD కి తగ్గించడం జరిగింది. వైబ్రియోనిక్స్ చికిత్స చేస్తున్నప్పుడు బాబు ఏ విధమైన ఇతర ఔషధాలను తీసుకోలేదు. బాలుడి తల్లిదండ్రులు ఈ అధ్భుతానికి ఎంతో ఆనందించి అనేకమంది పేషంట్లను ప్రాక్టీషనర్ వద్దకు పంపడం జరిగింది.