తరుచుగా వచ్చే తలపోటు 03554...Guyana
2016 నవంబర్ 1వ తేదీన 56-సంవత్సరాల మహిళ తరుచుగా తనను బాధించే తలనొప్పి నుండి ఉపశమనం కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. 5 సంవత్సరాల క్రితం ఇంట్లో జరిగిన గొడవల కారణంగా ఈమె భర్త కర్ర్ర తో తల పైన కొట్టడంతో అప్పటినుండి నొప్పి మరియు తలపోటు ఈమెను బాధిస్తోంది. డాక్టర్ ఏమి చెప్పారంటే తల పైన బలంగా మోదడం వలన మెదడంతా కదిలి కొన్ని కణాలు దెబ్బతినడం కారణంగా ఈ ఇబ్బంది కలుగుతోందని ఈమె శేష జీవితమంతా ఈ నొప్పిని భరించ వలసిందేనని దీనికి నివారణ ఏమీ లేదని చెప్పారు. దీనితో నిస్పృహ చెంది తలనొప్పి వచ్చినప్పుడల్లా అలోపతి నొప్పి నివారిణి వేసుకొన సాగారు
2016 ఆగస్టులో భర్త గతించిన తర్వాత ఈమెకు నడుము లోనూ చాతీ లోనూ నొప్పి రావడం మొదలయ్యింది. ఆమె ఇద్దరు డాక్టర్లను సంప్రదించగా ఒకరు భర్త మరణం వలన మానసిక వత్తిడి కారణంగా ఈ బాధ కలుగుతోందని మరొకరు కీళ్ళనొప్పులు కారణంగా కలుగుతోందని చెప్పారు. ఈమె వారు చెప్పిన రీతిగా మందులేమి తీసుకోకుండా ప్రాక్టీషనర్ ను సంప్రదించారు.వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :
తలనొప్పికి :
#1. CC11.3 Headaches + CC11.4 Migraines + CC18.1 Brain disabilities…TDS
వంటి నొప్పులకు :
#2. CC3.4 Heart emergencies + CC8.1 Female tonic + CC8.6 Menopause + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain…TDS
రెండు వారాలు వాడిన తర్వాత ఆమె తన తలనొప్పి, ఛాతిలో నొప్పి, నడుం నొప్పి అన్నీ పూర్తిగా అదృశ్య మయ్యాయని ఇవి ‘’అద్భుతమైన గోళీలు’’ అని ఆమె చెప్పారు. ఇలా మరో రెండు నెలలు TDS గా తీసుకొని ప్రయాణాల కారణంగా జనవరి 17 నుండి వాడడం మానేసారు. 2017డిసెంబర్ నాటికి ఆమెకు పై నొప్పులేమి పునరావృతం కాకుండా ఆనందంగా ఉన్నారు.