వెన్ను నొప్పి 11578...India
2016, మే 23 వ తేదీన 53-సంవత్సరాల ఆస్ట్రేలియా దేశస్తుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి గురించి ప్రాక్టీషనర్ ను కలిశారు. 12 సంవత్సరాల క్రితం అతనికి వీపు పైన తగిలిన దెబ్బ కారణంగా ఇది ఏర్పడింది. ఇతని వీపంతా నొప్పి ఉన్నప్పటికీ వీపుకు క్రింది భాగంలో మాత్రం నొప్పి భరింప రానిదిగా ఉంది. ప్రతీ రోజూ నొప్పితో బాధపడడం ఒక ఎత్తైతే ప్రొద్దుటే నిద్ర మంచం మీదనుండి లేవడంనరక ప్రాయంగా ఉంది . పేషంటు అలోపతి మందులను 6 నెలల పాటుగా క్రమం తప్పకుండా తీసుకొని అనంతరం బాధ భరింపరానిదిగా ఉన్నప్పుడే తీసుకొనసాగారు .ముఖ్యంగా బాధ చలికాలంలో మరి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి స్థితిలో పేషంటుకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…TDS నీటితో
చికిత్స మొదలు పెట్టిన కొద్ది రోజులకే శీతాకాలంలో వీరు ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది. రెండు వారాలలోనే తను ఉన్న ప్రాంతంలో శీతల వాతావరణం ఉన్నప్పటికీ వీరికి వెన్ను నొప్పి చాలా వరకూ తగ్గి పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగు వారాలలో వీరికి 40% శాతం మెరుగుదల కనిపించి 6 వారాల కల్లా నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. వెన్ను భాగం మునుపటికన్నా మృదువుగా అవడంతో గుండ్రంగా తిరగడంలో గానీ ఉదయమే మంచం మీదనుండి లేవడం లో గానీ ఇబ్బంది పడడం లేదు
రెమిడి ని మరో రెండు వారాలు తీసుకోని ఆ తరువాత తనకున్న అంతర్జాతీయ ప్రయాణాల వత్తిడి కారణంగా మందులు తీసుకోవడం మానేసారు. వైబ్రో మందులు తీసుకునే సమయంలో మరే ఇతర అలోపతి మందులు కూడా తీసుకోలేదు.
2017 జూలై నెలలో అనగా చికిత్స మొదలు పెట్టిన సంవత్సరం తర్వాత వీరు ప్రాక్టీషనర్ ను కలిసి తనకు పూర్తిగా తగ్గిపోవడమే కాక మరలా రాలేదని ఇప్పుడు కనీసం నొప్పి నివారణ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదని ఆనందంతో తెలియజేసారు.