పరిక్షలంటే అత్యంత భయం 03555...UK
2017 సెప్టెంబర్ 24 వ తేదీన 22-సంవత్సరాల మెడికల్ స్టూడెంటు మరో 5 రోజులలో ప్రారంభం కానున్న పరీక్షలు గురించి ఆందోళన చెందుతూ ప్రాక్టీషనర్ ను సంప్రదించాడు. అతని సమస్య ఏమిటంటే తను ఎప్పుడు పరీక్షలు వ్రాయాల్సి వచ్చినా ఎంతో వత్తిడికి ఆందోళనకు గురి అవడమే కాకుండా ఏమీ తినడానికి కూడా మనస్కరించదు. తలలో విపరీతమైన పార్శ్వపు నొప్పి వచ్చి దేనిమీద ఏకాగ్రత చూపలేని పరిస్థితి. దీనితో పాటుగా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పరీక్షలలో కూడా ఉత్తీర్ణుడు కాలేకపోతున్నాడు. గతంలో ఈ పేషంటు కొన్ని ఫ్లవర్ ఎస్సెన్ సెస్ తీసుకున్నాడు కానీ ఫలితం ఇవ్వలేదు. మరే ఇతర మందులు కూడా ఈ యువకుడు వాడలేదు. ఈ సమస్య తప్ప ఇతనికి మరే ఇతర సమస్యలు లేవు. ప్రాక్టీషనర్ ఇతనిని సముదాయించి త్వరలోనే తగ్గిపోతుందని భరోసా ఇచ్చి క్రింది రెమిడి ఇచ్చారు.
CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic...TDS
పేషంటుకు మొదటి డోసు ఇచ్చినప్పుడు ఎగిరి గంతేసి "నా హృదయాన్ని ఎదో తాకింది......నాకు ఎప్పుడూ ఇటువంటి అనుభవం ఎదురు కాలేదు " అన్నాడు! మెల్లగా అతను మామూలు స్థితికి వచ్చాడు. ప్రాక్టీషనర్ అతన్ని సముదాయిస్తూ అంతా సవ్యంగా ఉంటుందని ధైర్యంగా అతను పరీక్షలు రాయగలుగు తాడని ఊరడించారు.
పరీక్షలైన తర్వాత సెప్టెంబర్ 30 వ తేదీన ఇతను ప్రాక్టీ షనర్ వద్దకు వచ్చి తను పరీక్షలు చాలా బాగా రాయగలిగాననీ వైబ్రియానిక్స్ మందులు తనకు 100%.సహాయ పడ్డాయని చెప్పాడు. అలాగే పరీక్షలకు ముందు వెనుక కూడా తను ప్రశాంతంగానే ఉండగాలిగాననీ మునుపటి మాదిరిగా అనేకసార్లు వాష్ రూముకు వెళ్ళవలసిన పరిస్థితి రాలేదని చెప్పాడు. ఇప్పుడతనికి పార్శ్వపు నొప్పి గానీ, ఆందోళన గానీ వత్తిడి గానీ ఏదీ లేదు. ఇంత త్వరలో ఎంత మార్పు నమ్మలేకపోతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.