పునరావృతమవుతున్న జలుబు 03533...UK
బ్రిటన్ దేశానికి చెందిన 65-సంవత్సరాల వయసు గల మహిళ గత 30 సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకసారి అక్టోబర్ నెలలో మలేషియాలో ఉన్నతమ కుటుంబీకులతో 6 వారాల పాటు గడుపుతూ ఉంటారు. ఇలా మలేషియా వెళ్ళిన ప్రతీసారీ జలుబు,తీవ్రమైన దగ్గు సైనుసైటిస్ కలుగుతూ ఉన్నాయి. బహుశా ఇది ప్రయాణపు బడలిక వలన గానీ లేదా కాలుష్యం వలన గానీ కలుగుతున్నట్లు ఆమె భావించారు. ఈ సందర్శనలు ఇటు ఈమెకే కాక వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యాధుల బారిన పడడంతో వారికీ ఇబ్బంది కలిగిస్తున్నాయి. పేషంటు తనంతటతానే శ్లేష్మ నివారణకు డికాగ్నిస్టెంట్ లు ,ఇంకా యాంటి హిస్టమిన్లు, పారసిటమాల్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే ఇవి ఆమె బాధలు తగ్గించడానికి బదులు ఆమె మగతగా మత్తుగా ఉండేలా చేస్తున్నాయి., చివరికి ఆమె ఏ పరిస్థితికి వచ్చారంటే ఇక మలేషియా వెళ్ళడం కూడా మానుకోవలనుకున్నారు ఎందుకంటే ఆమె తిరిగి యుకె చేరే సరికి శక్తంతా హరింప బడి నీరసంగా ఐపోతున్నారు. ఇది ఆమె చేసే మిడ్వైఫ్ పనికి అంతరాయం కలిగిస్తోంది. 2015 అక్టోబర్ 18 వ తేదీన అనగా వీరు మలేషియా వెళ్ళడానికి 3 రోజులు ముందు ఈమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.:
CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic...BD
తను అక్కడ ఉన్నంతకాలము పేషంటు మందులను వేసుకోవడం జరిగింది. అంతేకాక తన కుటుంబ సభ్యులకు ముందు జాగ్రత్తగా ఇవ్వడం నిమిత్తం కొన్ని మందులను కూడా వీరు తీసుకెళ్ళారు. ఐతే కొందరే వీటిని వేసుకోవడం జరిగింది.అత్యంత ఆశ్చర్యకరంగా 30 ఏళ్లలో మొదటిసారి ఆమెకు జలుబు వంటివేమీ రాలేదు.అలోపతి మందులు వాడని మూలంగా ఆమెకు నిద్రమత్తు కూడా లేకుండా పోవడంతో తన కుటుంబ సభ్యులతో ఒక పెళ్లి సందర్భంగా ఆనందంగా గడపడానికి వీలయ్యింది. వీరి కుటుంబ సభ్యులు ఎవరయితే రెమిడి లు వాడారో వారు జలుబు బారిన పడకుండా హాయిగా ఉంటే రెమిడి లు తీసుకోనివారు మాత్రం ఆ లక్షణాలతో బాధ పడవలసి వచ్చింది. పేషంటు తిరిగి ఇంగ్లండు వచ్చాకా కూడా బలంగా ఆరోగ్యంగా ఉండగలిగారు. 2016.ఏప్రిల్ 5 న పేషంటు రెమిడి తీసుకోవడం మానేసారు. వీరు పార్ట్ టైం గా చేసే మిడ్ వైఫ్ ఉద్యోగం కొనసాగిస్తూ రాత్రిళ్ళు కూడా ఏ సమస్యా లేకుండా విధి నిర్వహణ చేయగలుగు తున్నారు. 2016 నవంబర్లో తను మలేషియా వెళ్ళవలసి వచ్చినపుడు వీరి కుటుంబ సభ్యులు తమకు కూడా రెమిడి మందులు తీసుకు రావలసిందిగా సూచించారు. పేషంటు తను వెళ్ళడానికి ముందే రెమిడి లు వేసుకోవడం ప్రారంభించి అక్కడ ఉన్నంతకాలము హాయిగా ఆరోగ్యంగా గడిపారు. 2017అక్టోబర్ 10 వ తేదీన తన వార్షిక ప్రయాణానికి ముందు వీరు ప్రాక్టీ షనర్ ను కలసినపుడు ఎంతో ఆరోగ్యంగా ఉండడమేకాక 2015 లో చికిత్స మొదలు కాక ముందు ఉన్న జలుబు,ఫ్లూ వంటివి మరలా పునరావృతం కాలేదు. తను మలేషియా వెళ్ళడానికి ఒక నెల ముందు నుంచి రెమిడి లు మొదలు పెట్టి తిరిగి వచ్చిన తర్వాత మూడు నెలలు కొనసాగించ వలసిందిగా సూచింపబడింది. వీరు యోగా తరగతులకు వెళుతూ ఆరోగ్యవంతమైన ఆహారము తింటూ చక్కని జీవనవిధానము గడుపుతూ ఆనందంగా ఉన్నారు.
సంపాదకుని వ్యాఖ్య : సాధారణంగా ప్రయాణానికి 3 రోజులు ముందు రెమిడి తీసుకుంటే సరిపోతుంది.