అండాశయము లో తిత్తులు, బాధాకరమైన ఋతు క్రమం 11568...India
30-సంవత్సరాల మహిళ ఒక సంవత్సర కాలంగా ఋతు సంబంధమైన నొప్పితో బాధపడుతూ 2017మార్చి3 వ తేదీన ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. ఈమెకు అధిక రక్తస్రావం తో పాటు ఎక్కువకాలం (15 రోజులపాటు) ఇది కొనసాగుతోంది. దీని నిమిత్తం ఆమె అలోపతి మందులు 6 నెలల పాటు తీసుకున్నారు కానీ ఏమీ ప్రయోజనం కనబడలేదు. 2016 అక్టోబర్ లో ఆమె పొత్తికడుపు ను అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించగా ఆమె అండాశయం కుడిప్రక్క 16మీ.మీ.కణితి ఉన్నట్లు తెలిసింది. నెల తర్వాత శస్త్ర చికిత్స చేసి దానిని తొలగించగా ఆమెకు అధిక రక్తస్రావం ఆగిపోయి నెలరోజుల పాటు చక్కగా ఉన్నారు. మరుసటి నెలలో మరలా పేషంటుకు సమస్య యధాతదంగా కొనసాగడం మొదలయ్యింది.
కణితి మరలా ఏర్పడిందేమో అన్న అనుమానంతో మరలా స్కాంనింగ్ తీయించగా తొలగించిన ప్రాంతంలోనే తిరిగి 17మీ.మీ.కణితి కనిపించింది. (రిపోర్టులు ఉన్నాయి). డాక్టర్లు ఆమెను మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచిస్తూ తాత్కాలిక ఉపశమనం కోసం నొప్పి నివారణ గోళీలు ఇచ్చారు. ఐతే మరలా శస్త్ర చికిత్స చేయించు కోవడానికి ఆమె సుముఖంగా లేరు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడినదే కాకుండా ఎన్నాళ్ళు ఇలా కొనసాగుతుందో కూడా తెలియదు.
వైబ్రో మందులు ప్రారంభించే నాటికి ఆమె తన ఋతు చక్రంలో రెండవ రోజు గడుస్తున్నది. ఆమె దీని నిమిత్తం మరే ఇతర మందులు తీసుకోవడం లేదు. 2017 మార్చి 22 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది. :
CC2.3 Tumours & Growths + CC3.7 Circulation + CC8.4 Ovaries & Uterus + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…6TD
రెమిడి తీసుకోవడం ప్రారంభించిన వెంటనే ఆమెకు ఎంతో ఉపశమనం కలిగింది. మూడు వారాల తరువాత డాక్టర్ సూచన పైన పొత్తికడుపు ను మరొకసారి స్కానింగ్ చేయించుకున్నారు. కణుతులేవి లేనట్లు రిపోర్టు వచ్చింది. (ఈ రిపోర్టులు కూడా ఉన్నాయి). అంతేకాకుండా సర్జెరీ చేయవలసిన అవసరం కూడా లేనందుకు ఆమె ఎంతో ఉపశమనం పొందారు. 17మి.మీ. తిత్తి ఆపరేషన్ లేకుండా అలోపతి మందులేవి వాడకుండానే అదృశ్యం అవడం చూసి డాక్టర్ ఎంతో ఆశ్చర్యపోయారు. ఆమెకు రక్తస్రావం కూడా చాలా స్వల్పంగా అవుతూ 8వ రోజుకు అదికూడా ఆగిపోయింది. అలాగే నొప్పి, మంట, కాళ్ళలో వాపు, నీరసం కూడా తగ్గిపోయాయి. మొత్తం మీద ఆమెకు అన్ని లక్షణాలకు సంబంధించి 75% ఉపశమనం కనిపించింది. అందుచేత మరో రెండు వారాలు ఇదే రెమిడిని TDS గా తీసుకోవలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు. పేషంటు యొక్క తరువాతి ఋతు చక్రం నాటికి వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా మాయమవడమే కాక రక్తస్రావం కూడా సాధారణ స్థాయి లో 4-5 రోజులు మాత్రమే కొనసాగింది. పేషంటు ఇప్పుడు చాలా బలంగా ఆరోగ్యంగా కనిపించారు. రెమిడిని మరొక నెల రోజులు OD గా తీసుకోని అనంతరం ఆపివేయవలసిందిగా సూచింపబడింది. 2018 జనవరి నాటికి వ్యాధి లక్షణాలేవి పునరావృతం కాకుండా పేషంటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు.