Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

హైపోఖాండ్రియా /వ్యాధి లేకపోయినా ఉన్నట్లుగా భ్రమించడం 11567...India


 35-సంవత్సరాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గత 4 సంవత్సరాలుగా బెంగగా ఉంటున్నారు. మాములుగా చూడడానికి బాగానే కనిపిస్తున్నా చిన్న చిన్న విషయాలకే వీరు ఆందోళన చెందుతూ ఉంటారు. ఎప్పుడైనా వీరి స్నేహితుడికో, లేక బంధువుకో రక్తపోటు అనిగానీ, మధుమేహం అని గానీ వింటే తనకి కూడా ఆ వ్యాధి వచ్చిందేమో అని కంగారు పడతారు.  ఇటువంటి అర్ధంలేని భయాలతో వీరికి పాదాలలో తిమ్మురులు, మధుమేహం ఉన్నట్లు భ్రాంతి, ఛాతిలో నొప్పి, గుండె దడ, రక్తపోటు ఉన్నట్లు భ్రాంతి, ఛాతిలో మంట, జీర్ణకోశ వ్రణములున్నట్లు భ్రాంతి, ఇవన్నీ కలుగుతున్నాయి. విపరీతమైన భయం దానితోపాటు పైన పేర్కొన్న వ్యాధులు ముఖ్యంగా గుండె దడ వీరి ఆందోళనను పెంచి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని కూడా భావించారు. ఇదంతా కూడా కేవలం ఒక మానసిక రుగ్మత తప్ప శరీర రీత్యా ఏ ఇబ్బంది లేదని కేవలం మానసిక ఆందోళన, వత్తిడి వలననే ఈ భ్రాంతులు కలుగుతున్నాయని పేషంటుకు కౌన్సిలింగ్ ఇవ్వబడింది. పేషంటు యొక్క బి.పి, షుగరు, కొవ్వు పదార్ధాల శాతం అన్నీ కూడా నార్మల్ గా ఉన్నాయని వారికి చూపించి స్థిమిత పరచడం జరిగింది.   

 2016, ఆగస్టులో క్రింది రెమిడి వీరికి ఇవ్వబడింది :

#1. CC4.5 Ulcers + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1Adult tonic + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC18.1 Brain disabilities...TDS

15 రోజుల తర్వాత  వీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తనకి ఆందోళన తగ్గింది గానీ ఇంకా అటువంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పారు. రెండు నెలల తర్వాత అతను, గత కొన్ని వారాలుగా రెమిడి తీసుకోకపోవడం వలన తన పరిస్థితి అధ్వాన్నంగా మారిందని చెప్పారు. అతని భయాలన్నీ పోగొట్టి నచ్చచెప్పి, రెమెడీని మరువకుండా నియమం ప్రకారం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి, రెమిడి ని క్రింది విధంగా మార్చి ఇవ్వడం జరిగింది:

#2. CC17.2 Cleansing + #1...TDS

పేషంటుకు ధ్యానము, ప్రాణాయామము వంటివి చేస్తూ విశ్రాంతి పొందవలసిందిగా సలహా ఇవ్వబడింది. ఒక వారము తర్వాత తనకు చెడు ఆలోచనలు రావడం, ఆందోళన 20%తగ్గినట్లు పేషంటు తెలియజేసారు. నెల రోజుల తర్వాత 90%మెరుగయ్యింది.  #2 ను అలాగే కొనసాగించవలసిందిగా సూచించడమైనది. నాలుగు నెలలు వాడిన తర్వాత పేషంటు 100% పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఐనప్పటికీ TDS గా 2 నెలలు, BD గా 2 నెలలు చివరగా OD గా 1 నెల కొనసాగించారు. తనకు పూర్తిగా నమ్మకము ఆత్మవిశ్వాసము చేకూరిన తర్వాత రెమిడి తీసుకోవడం ఆపారు. పేషంటు అనుదినమూ యోగా చేస్తూ ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని అనుసరిస్తున్నారు.

సంపాదకుని వ్యాఖ్య : *హైపోఖాండ్రియాసిస్ లేదా హైపోఖాండ్రియా అనేది ఒక వ్యక్తి అనవసరంగా తనకేదో జబ్బు ఉన్నట్లు అనుక్షణం భ్రమించే స్థితి. ఇది శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏ జబ్బూ లేదని మెడికల్ రిపోర్టులు సూచిస్తున్నా ఇంకా తనకేదో జబ్బు ఉందని బెంగ పెట్టుకోవడంగా చెప్పవచ్చు. హైపోఖాండ్రియా ఉన్న పేషంటును హైపోఖాండ్రియాక్ అంటారు. ఈ హైపోఖాండ్రియాక్లు ఏ చిన్న రోగ లక్షణాన్ని ఇతరులలో గమనించినా తమకు కూడా అది ఉందని అదొక పెద్ద జబ్బని ఆందోళన చెందుతూ ఉంటారు.