దీర్ఘకాలిక ఆస్తమా 11577...India
12 సంవత్సరాలుగా ఆస్తమా తో బాధ పడుతున్న 22-సంవత్సరాల యువకుడు 2016 మార్చి 5 న ప్రాక్టీ షనర్ ను సంప్రదించాడు. పగలు ఊపిరి తీసుకోవడానికి పెద్దగా ఇబ్బందేమీ లేకున్నప్పటికీ రాత్రిపూట మాత్రం చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇంతేకాక ఇతనికి జలుబు,దగ్గు వచ్చినప్పుడు మాత్రం వ్యాధి మరింత ఎక్కువై చాతీలో నొప్పి కూడా వస్తోంది. ఈ 12 సంవత్సరాలుగా అలోపతి మందులతో పాటు ఇన్హేలర్ కూడా వాడుతున్నప్పటికీ వ్యాధి అలానే ఉంటోంది. అలెర్జీ కలిగించే టటువంటి దుమ్ము,పుప్పొడి వంటివే తన వ్యాధిని ఎక్కువ చేస్స్తున్నాయని భావింప బడింది. ఇతనికి క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :
CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthma attack…TDS
రెమిడి ఇచ్చిన సందర్భంలో పేషంటు ఒక్క ఇన్హేలర్ తప్ప అలోపతి మందులేవీ వాడడం లేదు. రెండవ రోజున వ్యాధి బాగా ఎక్కువై రెండు వారాల పాటు కొనసాగింది. ఐనప్పటికీ పేషంటు రెమిడి తీసుకోవడం మానలేదు. మెల్లిగా వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి కొంత మెరుగుదల కనిపించ సాగింది. 8 వారాల తర్వాత పేషంటు ను ఆశ్చర్య పరుస్తూ వ్యాధి 100% నివారణ అయ్యింది. మరో రెండు వారాలు రెమిడి తీసుకొని తర్వాత మానివేసారు . ఐనప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉండసాగారు. ప్రస్తుతం ఇతనికి ఇన్హేలర్ తో పని లేకుండా పోవడమే కాక తిరిగి వ్యాధి లక్షణాలేమి తలెత్తకుండా ఆనందంగా ఉండసాగారు.