ఎక్జిమా 11585...India
ప్రాక్టీషనర్ AVP శిక్షణ పూర్తి చేసుకున్నాక మొదటి పేషంటు వీరి యొక్క 16 సంవత్సరాల అమ్మాయే. సంవత్సరంనర నుండి ఈమె రెండు కాళ్ళ పైనా తీవ్రమైన దురద నల్లని మచ్చలూ,సన్నని పొక్కులతో బాధపడుతున్నారు. నల్ల మచ్చలు ఈమె తొడ భాగము నుండి చీలమండల వరకూ వ్యాపించాయి. ఈమె సంవత్సరకాలం పాటు హొమియోపతీ చికిత్స తీసుకున్నారు కానీ ప్రయోజనం కనబడలేదు. కనుక ఒక అలోపతి డాక్టర్ ను సంప్రదించగా దీనిని ఎక్జిమా అని గుర్తించి ట్యాబ్లెట్లు ఆయింట్మెంట్ వ్రాసారు. మూడునెలల పాటు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ వ్యాధి లక్షణాలు అలాగే కొనసాగాయి.ఐతే అలోపతి చికిత్స వలన వ్యాధి మాత్రం ఇతర శరీర భాగాలకు వ్యాపించలేదు 2017 మార్చి 22 న అలోపతి మందులు ఆపివేసి ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :
#1. CC12.1 Adult tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema…TDS
#2. CC21.6 Eczema ను విభూతి మరియు కొబ్బరి నూనె లో కలిపి శరీరంపైన వ్యాధి ఉన్నచోట రాయడనికి ఇచ్చారు. ఒక వారంలో 25% మెరుగుదల కనిపించింది. దురద కొంచం తగ్గి మచ్చలు తగ్గుముఖం పట్టాయి. నాలుగు వారాలు గడిచేసరికి 100% వ్యాధి నివారణ జరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో మచ్చలూ,పొక్కులూ, దురదా,పూర్తిగా తగ్గిపోయినందుకు అమ్మాయి చాలా ఆనందించింది. కుటుంబ సభ్యులంతా ఈమె శరీరము పైన వ్యాధి లక్షణాలు ఏమీ లేకుండడం చూసి చాలా ఆశ్చర్యపడ్డారు.
డోసేజ్ ను మూడు నెలల వ్యవధిలో TDS నుండి OD కి మెల్లిగా తగ్గించడం జరిగింది. OD గా మరో నెల తీసుకున్న తర్వాత ఈమెకు వ్యాధి లక్షణాలు ఏమీ తిరిగి పునరావృతం కాకపోయే సరికి డోసేజ్ మరింత తగ్గిస్తూ OW గా మరొక నెల తీసుకోని అనంతరం పూర్తిగా మానివేసారు.