వెన్ను నొప్పి 11578...India
2016,మే 23వ తేదీన 53-సంవత్సరాల వయస్సుగల వ్యక్తి వెన్ను నొప్పి సమస్యతో ప్రాక్టీ షనర్ ను కలుసుకున్నారు.12 సంవత్సరాల క్రితం అతని వెన్నుముక కు తీవ్రమైన దెబ్బతగిలింది. నిజానికి అతని వీపు మొత్తానికి నొప్పి ఉన్నప్పటికీ క్రింది భాగంలో మరి ఎక్కువగా ఉంది.అలా ప్రతీరోజు నొప్పితోనే గడిచిపోయేది.ముఖ్యంగా మంచం మీదనుండి లేవడం నరకప్రాయం గా ఉండేది.6 నెలల పాటు అలోపతి మందులు తీసుకున్నారు అనంతరం నొప్పి బాగా భరింపరానిదిగా ఉన్నప్పుడు మందులు తీసుకునేవారు. ముఖ్యంగా శీతాకాలం నొప్పి భరింపరానిదిగా ఉండేది.అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది :
CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…TDS in water
ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొద్దికాలానికే వీరు వేరే దేశం శీతాకాలంలో వెళ్ళవలసి వచ్చింది. ఐతే రెండు వారాలలోనే చలి ఎక్కువగా ఉన్న ఆ వాతావరణంలో కూడా నొప్పి తగ్గి కొంత మెరుగనిపించింది.
చికిత్స మొదలుపెట్టిన 4 వారాల తర్వాత 40% ఆరువారాల తర్వాత 100% మెరుగుదల కనిపించింది. వీరు అటూఇటూ సులువుగా తిరగగలగడమే కాక ఉదయం పక్క మీదనుండి లేవడం కూడా ఇబ్బందేమీ లేకుండా లేవగలుగుతున్నారు .
మరో రెండు వారాలు రెమిడి తీసుకున్న తర్వాత అతని అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రీత్యా అనేక దేశాలు తిరగవలసి ఉన్నందున రెమిడి తీసుకోవడం పూర్తిగా మానేశారు. సంవత్సరం తర్వాత అనగా 2017 జూలై నెలలో తనకు మరలా నొప్పిగని మరేవిధమైన ఇబ్బంది గానీ రాలేదని చెప్పారు.