శప్తాల పండ్ల చెట్టుకు జిగురు వ్యాధి 01620...France
2017 ఏప్రిల్ నెలలో ఒక మహిళ (గమ్మోసిస్) వ్యాధితో బాధ పడుతున్న తన శప్తాలు పండుల(పీచ్ )చెట్టు కు చికిత్స కోసం వచ్చారు.ఈ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేకుండా మొత్తం రాలిపోయాయి.గత సంవత్సరం ఆమెకు కాయలేమి దొరకలేదు ఉన్నవి కూడా పురుగుల బారిన పడ్డాయి.కనుక ఈ మహిళ తన చెట్టుకు రెమిడి కావాలని ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు . ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ని ఆమెకు ఇచ్చారు:
CC1.2 Plant tonic…OW
ఐదు గోళీలను 200 మీ.లీ.నీటిలోవేసి అవి కరిగిన తర్వాత బాగా కదిపి ఈ నీటిని లీటరు నీటిలో కలపాలి. బాగా కదిపిన తర్వాత అవసరమైతే నీటిని కలిపి 10 లీటర్ల ద్రావణం గా కూడా తయారుచేసుకోవచ్చు.
ఈ మహిళ ఈ ద్రావణాన్ని రెండు వారాలలో రెండు సార్లు మాత్రమే చల్లారు.మొదటిసారి చల్లిన తర్వాత ఆకులు పెరగడం మొదలయ్యాయి.
2017 సెప్టెంబర్ లో పంట దిగుబడి అద్భుతంగా ఉండడంతో పాటు ఆకులు అద్బుతంగా ఉండడం, ౩౦కిలొగ్రాములు అందమైన పండ్లు లభించడమూ జరిగింది..
చెట్టు యజమాని వ్యాఖ్య :
నాకు ఎంత అద్బుతంగా ఉందంటే శప్తాలు లు పండు విరివిగా కాచి వానితో నేను జాం మరియు కేకులు ఎన్నో తయారుచేసుకున్నాను .ఈ ఫలితం చూసాక మందు ద్రావణాన్ని గార్డెన్ లో ఉన్న అన్ని మొక్కలకు చల్లాను. వచ్చిన ఫలితాలతో ఆనందంగా ఉన్నాను.
సంపాదకుని వ్యాఖ్య ;
*గమ్మోసిస్ అనేది కొన్ని రకాల మొక్కలు చెట్లకు జిగురు వంటి ద్రావకము కొమ్మలపైనా కాండము పైనా స్రవించడం.ఈ వ్యాధి కొన్నిపరాన్న జీవుల ప్రభావము చేత ఆకురాల్చే చెట్లకు ముఖ్యంగా చెర్రీ,ప్లం,అప్రికాట్, పీచ్ మరియు నారింజ రకాల చెట్లకు వస్తూ ఉంటుంది.