కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్ (CTS) 11576...India
46-సంవత్సరాల వయసుగల మహిళ కు మే 2016 నుండి కుడి మణికట్టుకు (CTS) వ్యాధి అనగా ప్రధాన నరము కుంచించుకుపోవడం వలన కలిగే నొప్పి తో కూడిన వ్యాధి వచ్చింది. ఆమెకు కంప్యూటర్లపట్ల ఆసక్తి లేదు,సెల్ఫోన్లు ఉపయోగించరు. వైద్య సంబంధముగా ఈ వ్యాధికి తగిన కారణమూ తెలియరాలేదు. నాలుగు వారాలుగా ఆమెకు తీవ్రమైన నొప్పి ,మరియు కొంచం వాపు కూడా ఉంటున్నాయి.ఇంతేకాక ఈ నొప్పి బొటన వ్రేలు,చూపుడు వ్రేలు,మరియు మధ్య వ్రేలు మీదుగా భుజం వరకూ వ్యాపిస్తోంది. వీరి యొక్క డాక్టర్ దీనిని తీవ్రమైన CTS కండిషన్ గా పరిగణించారు. డాక్టర్ ఆమె మణికట్టు వద్ద ఒక బద్ద వంటి ఆధారముతో ముంజేతిని జాలీ వంటి భాగంలో ఉండేవిధంగా అమర్చారు.అలోపతి వైద్యం మొదటిరోజున ఆమెకు నొప్పి నివారిణి ఇచ్చి అదనంగా ఇబు ప్రోఫెన్ BD గా ఇచ్చారు కానీ దీనివల్ల ఆమెకు తలతిరుగుడు ఊపిరి అందకపోవడం వంటివి ఏర్పడడం తో ప్రాక్టీషనర్ వద్దకు రావడానికి వారం రోజులు ముందు వాటిని తీసుకోవడం మానేసారు. వీరు హోమియోపతి మందు రుటా గ్రావోలేన్స్ 30C,కూడా తీసుకున్నారు కానీ వైబ్రో చికిత్స ప్రారంభమవుతూనే వాటిని మానేసారు.
పెండ్యులం ద్వారా చేసిన పరిశీలన లో వీరికి కుడి మనికట్టులో నరము కుంచించుకు పోవడం మరియు కాల్షియం లోపము బహిర్గతమయ్యాయి. 2016 జూన్ 3 వ తేదీన క్రింది రెమిడి వీరికి ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis…TDS నీటితో
రెండు రోజులలో 20% మెరుగుదల కలగడం తో వీరికి డాక్టర్ కట్టిన జాలీ వంటి దానిని వారంతట వారే తొలగించుకున్నారు.నాలుగు రోజులకల్లా భగవంతుడి లీల మాదిరిగా నొప్పి మొత్తం మాయమయ్యింది. జూన్ 16 కల్లా డోసేజ్ BD గానూ మరొక నెలా పదిహేను రోజులు OD గానూ తరువాత అక్టోబర్ వరకూ OW గా తీసుకొని తరువాత మనివేసారు. 2017 ఆగస్టు నాటికి వీరికి CTS, వ్యాధి గానీ కనీసం చిన్న నొప్పి కూడా లేకుండా ఆనందగా ఉండగలిగారు.