కిళ్ళ వాతము 11582...India
2016 ఆగస్ట్ 27 తేదీన 37-సంవత్సరాల వయసుగల మహిళ కీళ్ళ వాతము తో ప్రాక్టీషనర్ ను సంప్రదించడం జరిగింది.ఇద్దరు పిల్లల తల్లి ఐన ఈమెకు రెండవ ప్రసవము తర్వాత కీళ్ళ లోనూ వ్రేళ్ళ లోనూ బొటన వేళ్ళ లోనూ విపరీతమయిన నొప్పి కలగ సాగింది. ఈవిధంగా 7 సంవత్సరాలుగా బాధ పడుతోంది.. వీరు నిముసిలిడ్ మాత్రలను డాక్టర్ సూచన మేరకు BD,గా తీసుకుంటున్నారు. అదనంగా వీరు ఆయుర్వేద ఆయిల్ మాసేజ్ కూడా ప్రయత్నించారు.కానీ ఏవి కూడా ఈమెకు వ్యాధిని తగ్గించలేక పోయాయి. ఆమె వ్రేళ్ళు కూడా వంకర తిరిగి ఉన్నట్లు ప్రాక్టీ షనర్ గమనించారు. కనుక ఈ మహిళ ఇతరత్రా కోర్సులన్ని మానివేసి వైబ్రో నే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. క్రింది రెమిడి ఆమెకు ఇవ్వబడినది :
CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue...QDS for 15 days, thereafter TDS
వీరికి త్వరగానే స్వస్థత చేకూరి నెల రోజులలోనే 35% మెరుదల కనిపించిందని ఆనందంగా తెలిపారు.రెమిడి ని TDS తీసుకున్నారు మరో రెండు నెలలలో పేషంటుకు నొప్పి విషయంలో 90% మెరుగుదల కనిపించింది. ఆమె వ్రేళ్ళు ఇప్పుడు వంకరగా ఉండడం లేదు ఆమె తన పనులను మాములుగానే చేసుకోగలుగుతున్నారు. 2017 జనవరి 3వ తేదీన తనకు 100% నయమైనట్లు తెలిపారు.కనుక డోసేజ్ ను BD గారెండు నెలలు ఆ పైన క్రమంగా తగ్గించుకుంటూ OD గా మార్చి 2017 ఆగస్టు 5 నాటికి పూర్తిగా మానివేయడం జరిగింది.అలాగే ప్రాక్టీషనర్ సూచన మేరకు పేషంటు తన జీవన సరళిని మార్చుకొని ప్రతీ రోజు కొన్ని ఎక్సెర్ సైజులు చేయడం యోగా చేయడం అలవరుచుకున్నారు. అలాగే ఆహారము విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకొని వంకాయలు,ఆలుగడ్డలు తినడం పూర్తిగా మానేసారు. 2017 సెప్టెంబర్ నాటికి ఆమెకు ఎటువంటి నొప్పి లేకుండా పూర్తిగా తగ్గిపోవడంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.