ఉదరంలో తిమ్మిరులు 03542...UK
2016 నవంబర్ 20 వ తేదీన 8 సంవత్సరాల పాపకు భరింపరానిది నొప్పి రావడంతో పాప బాధను చూచి తట్టుకోలేక ఆమె తల్లి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. పాపకు గతంలో ఇటువంటి నొప్పి ఎప్పుడూ రాలేదు. ప్రస్తుతం ఈ నొప్పికి మందులేమి తీసుకోలేదు. అసలు విషయం ఏమిటంటే ఆరోజు మధ్యాహ్నం పాల్గొనవలసి ఉండిన ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కోసం పాప కొన్ని నెలలుగా ప్రాక్టీసు చేస్తోంది. పాప పరిస్థితి దృష్ట్యా పాపకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…6TD
పాప వెంటనే కోలుకోవడమేకాక రెమిడీ ఉపయోగించిన కొద్దిగంటలలోనే డ్యాన్స్ ప్రోగ్రాం లోకూడా పాల్గొన్నారు. డోసేజ్ తరువాత రెండురోజుల వరకు TDS కు తగ్గించి తరువాత విరామం ఇవ్వబడింది. 2017 జూలై నాటి వరకూ తెలిసిన సమాచారం ప్రకారము పాపకు ఈ వ్యాధి తిరిగి తలెత్తలేదు.
పేషెంట్ యొక్కతల్లి వ్యాఖ్యలు :
మొదటిడోస్ వేసుకోగానే అమ్మాయికి ఎంతో మెరుగనిపించింది. నేను ప్రతీ రెండుగంటలకు ఒకసారి రెమిడి వేయసాగాను. ఎంత అద్భుతం జరిగిందంటే అంత త్వరగా కోలుకోవడం నేను కనీసం కలలో కూడా ఉహించలేదు. ఆ తరువాత నొప్పిగానీ మరి ఏ ఇతర ఇబ్బంది లేకుండా మా అమ్మాయి ఆనందంగా ఉండగలిగింది . అంతేకాక పూర్తిగా కోలుకొని యధా స్థితికి వచ్చేసింది అంటూ ఆ తల్లి వైబ్రియోనిక్స్ కు మరియు భగవంతుడికి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
సంపాదకుని వ్యాఖ్య :
ఇటువంటి ఎక్యుట్ కేసులలో ప్రతీ పది నిమిషాలకు ఒక డోస్ చొప్పున రెండు గంటల వరకు ఇచ్చి తరువాత డోసేజ్ ను 6TD.కి తగ్గించ వచ్చు .