దీర్ఘకాలిక ఎలర్జీ మరియు మలబద్దకం 11578...India
2016 ఏప్రిల్ 11 వ తేదీన, 35-సంవత్సరములమహిళ 8 సంవత్సరములుగా దగ్గుతో ఇబ్బందిపడుతూ చికిత్స నిమిత్తం ప్రాక్టీషనర్ను సంప్రదించారు. వీరికి డస్ట్ ఎలర్జీ ఉండడంతో ప్రతీరోజూ ఉదయం నిద్రలేవగానే నిరంతరాయంగా దగ్గువస్తుండం వలన ఛాతీలో నొప్పి వస్తోంది. వీరికిమలబద్దకం సమస్య సంవత్సరం నుంచి బాధిస్తూ ఆసనము వద్ద నొప్పికలగజేస్తోంది. ఆమె ఏ విదమైన వైధ్య సహాయం తీసుకోలేదు.
ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :
దీర్ఘకాలికమైన దగ్గుకు :
#1. CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies...TDS
మలబద్ధకానికి :
#2. CC4.4 Constipation + CC4.10 Indigestion + CC12.1 Adult tonic...TDS
రెండు వారల తరువాత ఆమెకు వ్యాధి లక్షణాలన్నింటి యందున దాదాపు 100% మెరుగుదల కనిపించింది. ఉదయమే ఆమెను బాధించే దగ్గు పూర్తిగా తగ్గిపోయింది. అలాగే మలబద్ధకం సమస్య మరియు దాని నుండి ఉత్పన్నమైన పురీషనాళము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఆమె #1 మరియు #2 మరో రెండు వారాలు తీసుకున్నారు. ఆ తరువాత పేషంటు తనకు పూర్తిగా ఆరోగ్యము చేకూరినందువల్ల రెమిడి లు తీసుకోవడం మానివేసారు.
సంపాదకుని వ్యాఖ్య :
ఈ పేషంటు బహుశా ఊరునుండి వెళ్ళిపోయినందువల్ల కావచ్చు వీరి ఆరోగ్యం గురించి ఇటీవల కాలంలో ఏ సమాచారము లేదు