చేతి వేళ్ళకు పక్షవాతం 03554...Guyana
2016 అక్టోబర్ 21 న 62-సంవత్సరాల మహిళ ఎడమ బొటనవేలుకు వాపు మరియు భరించరాని నొప్పి తో 5 నెలలు గా బాధ పడుతూ చికిత్సా నిపుణుని వద్దకు వచ్చారు. ఈ వాపు మెల్లిగా చెయ్యంతా వ్యాపించింది. ఆమె డాక్టర్ ను సంప్రదించగా అతను బొటనవేలుకు కన్నం పెట్టి దూది పెట్టాడు దానివల్ల నొప్పి నుండి కానీ వాపు నుండి కానీ నివారణ జరగలేదు. మరొక డాక్టర్ను సంప్రదించగా వేలికి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఆపరేషన్ చేసి మునపటి డాక్టర్ లోపల ఉంచిన దూదిని తొలగించే సరికి చీము ధారగా వచ్చేసింది. నొప్పి నివారణ టాబ్లెట్లు ఇవ్వడం వల్ల వాపు నొప్పి కూడా తగ్గింది కానీ మూడు వేళ్ళకు స్పర్శ జ్ఞానం పోయింది. ఆమె తన వేళ్ళను మూయలేదు తెరవలేదు.
ఈ పేషంటుకు చాలా సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పి కూడా ఉంది. డాక్టరు మోచిప్పలను మార్చే శస్త్ర చికిత్స చేయాలనీ కూడా చెప్పారట. ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది.
#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis…TDS in water
మూడు రోజులలో ఆమె వేళ్ళకు స్పర్శ జ్ఞానం తెలిసింది.రెండు వారాలలో 75% మెరుగుదల కనిపించి వేళ్ళను ముడిచి తెరవడం కూడా చేయగలిగింది. ఆ తర్వాత ఆమెకు క్రింది విధంగా రెమిడి వేరువేరుగా ఇవ్వబడింది.
చేతికి :
#2. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia…TDS
మోకాళ్ళ నొప్పికి :
#3. CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
2017 జనవరి 10 కల్లా వేళ్ళకు పూర్తి స్పర్శ కలిగింది. దీనితో #2 OD గా తగ్గించడ మైనది. మే మొదటి వారానికి మందు తీసుకోవడం పూర్తిగా ఆపివేయడం జరిగింది. జూలై నెల లో కూడా వ్యాధికి సంభందించిన చిహ్నలేమి కనపడలేదు. ఐతే వేళ్ళను ఎక్కువగా ఉపయోగించ వలసివస్తే స్వల్పంగా నొప్పి అనిపించేది అలాగే మోకాళ్ళ నొప్పి కూడా 50% తగ్గిపోయింది. ఇక శస్త్ర చికిత్స కూడా అవసరం పడనందున ఆమె #3 నొప్పి పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.