క్లోరిన్ వలన వచ్చే ఎలర్జీ 11422...India
2015 ఆగస్టు 8 వ తేదీన 21 సంవత్సరాల యువ ప్లంబరు కళ్ళు నొప్పి, తలపోటు, మసకగా ఉండే దృష్టి ఈ సమస్యలతో ప్రాక్టీ షనర్ వద్దకు వచ్చారు. గత రెండు సంవత్సరాలుగా స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేయడానికి క్లోరిన్ ను ఏ ఇబ్బంది లేకుండా వాడుతున్నాడు. కానీ గత రెండు నెలలుగా ఈ క్లోరిన్ వాడుతున్నప్పుడు పైన పేర్కొన్న ఇబ్బందులు వస్తున్నప్పటికీ గత రెండు రోజులుగా బాధలు భరింపరానివిగా ఉండేసరికి ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ప్రాక్టీ షనర్ ఈ యువకుడు వాడుతున్న క్లోరిన్ ను కొంత శాoపిల్ తీసుకురమ్మని చెప్పి దాని ద్వారా క్రింది నోసోడ్ తయారు చేసి ఇచ్చారు:
Potentised chlorine 200C…TDS
కొంత కాలము పాటు క్లోరిన్ కు దూరముగా ఉండమని చెప్పడంతో ఈ యువకుడు తన యజమాని అనుమతి తో నెలవరకూ దానిని ముట్టలేదు.
నెలతరువాత ప్రాక్టీ షనర్ తో ఈ నెల రోజులలో రెండుసార్లు మాత్రమే కంటినొప్పి, తలపోటు వచ్చాయని కళ్ళ మసకలు మాత్రము ఒక్కసారి కూడా రాలేదని యువకుడు చెప్పాడు. మరో రెండు వారాలు రెమిడిని కొనసాగించమని చెప్పడంతో తిరిగి పనిలోకి వెళుతూనే మందులు వాడసాగాడు. ఐనప్పటికీ క్లోరిన్ తో మునుపటి ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. ప్రస్తుతం ఏ ఇబ్బందులు లేకుండా తన పనిని కొనసాగిస్తున్నారు.