మూత్రం జారీలో మంట 02308...Slovenia
2016 జూన్ 21 న 74-సంవత్సరాల వృద్ధ మహిళ నాలుగు రోజులుగా మూత్రం జారీ చేయునపుడు మంట వస్తోందనే కారణంతో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. బహుశా మానసిక సంబంధమైన వత్తిడి దీనికి కారణం కావచ్చు. అలోపతిక్ డాక్టర్ ఇచ్చిన యాంటీ బయోటిక్ మందులు మూడు రోజులు వాడినప్పటికీ ఏమాత్రం గుణం కనిపించలేదు. గతంలో ఆమెకు వైబ్రో రెమిడిల ద్వారా వ్యాధి నయమైన అనుభవంతో చికిత్సా నిపుణుడిని సంప్రదించగా వారు క్రింది రెమిడి ఇచ్చారు:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.3 Incontinence...ప్రతీ 20 నిమిషాలకు ఒక డోస్ చొప్పున 2 గంటల వరకు
మరునాటికి నొప్పి తగ్గిపోయిందని ఆమె చెప్పడంతో ముందటి డోస్ మరొక నాడు కొనసాగించి అనంతరం మెల్లిగా QDS కు ఆ తర్వాత నెమ్మదిగా BDకి తగ్గించడం జరిగింది. వైద్యం మొదలు పెట్టిన 6-7 రోజుల తర్వాత పేషంట్ కి పూర్తిగా తగ్గిపోవడంతో మరో రెండు రోజులపాటు OD గా ఇచ్చి అనంతరం ఆపివేయడం జరిగింది.
2017 మే 27 వ తేదీన వ్యాధి తిరిగి రావడంతో ఆమె డాక్టర్ గారికి చూపించుకోకుండా ప్రాక్టీషనర్ ను వెంటనే రావలసిందిగా కబురు పెట్టారు. అంతకు ముందు ఇచ్చిన డోసేజ్ తిరిగి ఇవ్వబడింది. ఒక్కరోజులోనే వ్యాధి తగ్గుముఖం పట్టడమే కాక రెండు వారాలలో ఆమెకు 100% నయమయ్యింది. ఆమె ఈ రెమిడిని OD ప్రివెంటివ్ డోసేజ్ గా ఎక్కువ కాలం తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు.
2012 జనవరి నుండి ఈ పేషంటు వైబ్రియోనిక్స్ మందులు అజీర్నము, తలతిరుగుట, నిద్రలేమి, గోరుచుట్టు(నెయిల్ ఫంగస్) బి.పి, ఫ్లూ, వెన్నునొప్పి, వంటి ఇతరత్రా వ్యాధులకు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాక చికిత్సానిపుణుడి సూచన పైన తన ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు చేసుకున్నారు.