1. శ్వాస సంభందిత ఇన్ఫెక్షన్, అలెర్జీ 02308...Slovenia
2016 మే 20 వ తేదీన ఒక తల్లి తన 7 సంవత్సరాల కుమారుడిని శ్వాశకోశ వ్యాధుల నిమిత్తం చికిత్సా నిపుణుడి వద్దకు తీసుకొని వచ్చింది. ఈ బాబుకి 9వ నెలనుండి శ్వాశనాళముల వాపు (bronchitis) వ్యాధితో బాధ పడుతూ ఉన్నాడు. ఇంకా ఈ అబ్బాయిని న్యుమోనియా, టాన్సిల్స్, అస్తమా, దడ దడ ధ్వని వచ్చే దగ్గు, డస్ట్ అలెర్జీ ముదలగు వ్యాదుల నిమిత్తము ప్రత్యేకించి శీతాకాలంలో అనేక సార్లు హాస్పిటల్ చుట్టూ తిప్పవలసి వచ్చేది. 2015-16 లో అనేక వైరల్ వ్యాధుల నిమిత్తం హాస్పిటల్ కి తీసుకెళ్ల వలసిన అవసరం ఏర్పడింది. బాబు తల్లి రాబోయే శీతాకాలంలో ఇంకెంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధపడాలో అని భయపడ సాగిందట. బాబు అస్తమా మరియు అలెర్జీ నిమిత్తం ‘’ఫ్లిక్సోటైడ్, వెంటోలిన్ మరియు సింగులర్ మందులు వాడుతూ ఉండేవాడు. బాబును చికిత్సా నిపుణుడి వద్దకు తీసుకొని వచ్చేనాటికి వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేకపోయినప్పటికీ క్రింది రెమిడి ఇవ్వబడినది:
#1. CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.5 Sinusitis + CC19.6 Cough chronic...TDS
వారం తరువాత బాబు తల్లి చెప్పిన విషయం ప్రకారం మందు ఇచ్చిన రెండు రోజులు మాత్రం బాబు విపరీతంగా దగ్గాడని(బహుశా పుల్లౌట్ వల్ల కావచ్చు)కానీ ఆ తర్వాత చక్కగా ఉన్నాడని చెప్పింది. డోసేజ్ ని BD కి తగ్గించడం జరిగింది. తరువాత వారము లో 5 రోజుల పాటు బాబుకు కఫంతో కూడిన దగ్గు వచ్చిందట. వాళ్ళ డాక్టర్ మందులన్నీ మానేసి ఫ్లెక్సిటోడ్ మాత్రం రోజుకు ఒక్కసారి వేసుకోమని చెప్పారట. జూలై 1 నాటికి బాబుకు తగ్గిపోవడంతో రెమిడి #1 కూడా OD కి తగ్గించడం జరిగింది. ఆగస్ట్ లో దీనిని 3TW కి తగ్గించడం జరిగింది.
నవంబర్ మొదటి వారంలో ఇతనికి వ్యాధి లక్షణాలు తిరిగి కలిగాయి. ఇతనికి దగ్గు రావడంతో డోసేజ్ ని TDS కి పెంచి అతనికి స్వస్థత చేకూరగానే తిరిగి మెల్లిగా OD కి తగ్గించడం జరిగింది.
2017 జనవరి 28 వ తేదీన అనగా 3 నెలల తర్వాత అతనికి మరలా దగ్గు వచ్చింది. ఇదే సమయంలో బాబు తల్లి యొక్క సోదరునికి కూడా జలుబు చేసింది. కనుక ఒక కొత్త కొమ్బో ఇవ్వడం జరిగింది.
#2. CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic...TDS
రోగి పరిస్థితి కొంచెం మెరుగయ్యాక డోసేజ్ ODకి తగ్గించబడింది. రోగికి ఎప్పుడు దగ్గు వచ్చినా వెంటనే #2 డోస్ రిలీఫ్ ఇస్తూ ఉండేది. ఐతే చాలాకాలంగా ఈ శ్వాశ సంబంధితమైన వ్యాధి ఉన్నందున ఆ తల్లి ఫ్లిక్సిటోడ్ ను #1 తో పాటుగా OD గా ఇవ్వసాగింది. చాలా సంవత్సరాల తర్వాత 2016-17 సంవత్సరంలో శీతాకాలం బాబుకు ఆనందకరమైందిగా మారిపోయింది. 2017, మార్చి లో బాబు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాడని ఆమె చెప్పింది.