పరీక్షల ఆందోళన రుగ్మత 02899...UK
2016 మార్చ్ 27 వ తేదీన 15 సవత్సరాల బాబును అతని తల్లి ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చారు. ఈ బాబు GCSE తుది పరీక్షకు తయారవుతూ చాలా అందోళన చెందుతున్నాడు. ఈ పరీక్ష అతని జీవితానికే ఒక ముఖ్యమైన మలుపు వంటిది. సాధారణంగా పరీక్ష అంటే ఎలాంటి ఆందోళన పడని ఈ బాబుకు ఏదో తెలియని భయం ప్రారంభమయ్యి ముక్కు వెంట రక్తం కూడా వస్తోంది. దీని నిమిత్తం మందులేమి వాడడం లేదు కానీ ఈ బాబు చిన్నప్పటినుండి కూడా గొంతుమంట తోనూ, చలికాలంలో జలుబుతోనూ బాధపడుతూ డాక్టర్ సలహా అనుసరించకుండానే ఏవో కొన్ని బాధా నివారణలను వాడేవాడు. ఐతే వీటివల్ల తాత్కాలిక ఉపశమనమేకానీ రోగనివృత్తి మాత్రం కలిగేది కాదు. బాబు తల్లి ప్రాక్టీషనర్తో యితడు చాలా సున్నిత మనస్కుడు, భావోద్వేగాలు చాలా ఎక్కువ అని కూడా చెప్పారు.
ప్రాక్టీషనర్ బాబుకు క్రింది రెమిడి సూచించారు:
CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.7 Throat chronic…నీటితో గంట వరకూ పదినిమిషాల కొకసారి అనంతరం 6TD
6 వారాల తర్వాత బాబు తల్లి రెమిడి అద్భుతంగా పనిచేసిందని, పరీక్షలు భయంలేకుండా రాయగలిగాడని, ముఖ్యంగా బాబుకు మందుల పట్ల ఎంతో విశ్వాసం పెరిగిందనీ తాను రెమిడి నీటితో కలపడం మరిచిపోయినా బాబే తనంతట తాను కలుపుకుంటూ ఉంటాడని చెప్పారు. బాబు పరీక్షలు మే, జూన్ లలో వ్రాయగా వాటి ఫలితాలు ఆగస్టులో వచ్చాయి. సెప్టెంబర్ 27న బాబు తల్లి టెలిఫోన్లో బాబు పరీక్షల్లో చక్కని స్కోర్ సాధించాడని రోగలక్షణాలు పూర్తిగా తగ్గి ప్రశాంతంగా ఉంటున్నాడని చెపుతుంటే బాబు ఫోన్ తీసుకొని తనకు మందులు అద్భుతంగా పనిచేసాయని పరిక్షా ఫలితాలు చూసి తన స్నేహితులు, బంధువులు, అమ్మా నాన్నా కూడా ఎంతో ఆశర్య పోతున్నారని ఎంతో ఉద్విగ్నంగా చెప్పాడు. 2016 జూలై నుండి 27 మార్చ్ 2017 వరకూగల సమయయంలో తనకు ఆందోళనగాని, ఒత్తిడి గానీ ముక్కు వెంట రక్తం కారడం గానీ, గొంతుమంట, జలుబు ఇవేమీ లేవని చక్కగా చదువుకోగాలుగుతున్నాననీ చెప్పాడు.
పేషంటు వివరణ:
పరీక్షలకు ముందు నాలో భరింపరాని వత్తిడి, ఆందోళన ఉండేది. నా పైన నాకు ఎన్నో ఆశలు ఉండేవి కానీ వత్తిడి నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. మా అమ్మ ప్రాక్టీషనర్ నుండి మందు తెచ్చాక గంట వరకు ప్రతీ 10 నిమిషాల కొకసారి వేసుకున్నాను. తర్వాత రెండు గంటలు విరామం ఇచ్చి తిరిగి మందు వేసుకోవడం ప్రారంభించాను. రెండు వారాలు వాడిన తర్వాత నాకెంతో తేలిక అనిపించింది. ఎక్కువ సమయం వత్తిడి లేకుండా ఉండగాలిగేవాడిని. పరిక్షలలో మంచి స్కోర్ సాధించాను. దీనికంతటికి కారణం నీటితో తీసుకున్న రెమిడినే. నన్ను ఈ రకంగా ఆరోగ్యవంతుణ్ణి చేసినందుకు ప్రాక్టీషనర్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.