దీర్ఘకాలిక ఆమ్లత్వము మరియు గోధుమలు పడక పోవడం (ఎలర్జీ) 10001...India
2015 సెప్టెంబర్లో 28 సంవత్సరాల మహిళ ప్రాక్టీషనర్ను కలసి తను గత 8 సంవత్సరాలుగా ఆమ్లత్వముతో బాధ పడుతున్నట్లు చెప్పారు. దీనివల్ల రోజంతా తలపోటుగా ఉంటోంది దీని నివారణకు నొప్పి నివారిణిగా క్రోసిన్ తీసుకుంటున్నారు. దీనివల్ల విపరీతమైన ఒత్తిడికి లోనవడము, తనపైన తనకు విశ్వాసం సన్నగిల్లడం జరుగుతోందని ఆమె తెలిపారు. అలోపతి మందులతో విసుగు చెంది వైబ్రో ప్రాక్టీషనర్ను ఆశ్రయించడంతో క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది.
అమ్లత్వము మరియు శిరోవేదనకు (For acidity and headache):
#1. CC4.10 Indigestion + CC11.3 Headaches + CC12.1 Adult tonic…6TD
ఎక్కువ మానసిక వత్తిడి ఉన్న సమయాలలో (During periods of high stress):
#2. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic…ఒక్క డోసు, అవసరమైనప్పుడు
మొదటి వారం వాడిన తర్వాత పేషంటు తనకు తలపోటు విషయంలో 80 శాతం మెరుగుదల కనిపించిందని చెప్పారు. ఈ వారంలోపు #2 ను ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకున్నానని వత్తిడి కూడా చాలావరకు తగ్గిందని తెలిపారు. నెల రోజులు వాడిన తర్వాత #1ను TDS గానూ ఆపైన క్రమంగా తగ్గించుకుంటూ OW తీసుకోసాగారు. #2 యొక్క అవసరం లేదు కనుక దానిని పూర్తిగా మానివేసారు.
2016 ఫిబ్రవరి నెలలో పేషంటు తనకు 3 సంవత్సరాలుగా గోధుమ పిండితో చేసిన చపాతీలు తింటే పడడం లేదని అవి తిన్న వెంటనే కడుపునొప్పి వస్తోందని చెప్పారు. ప్రాక్టీ షనర్ గోధుమ పిండిని 200 C తో (potentising it at 200C ) పోటెంటైజ్ చేసి TDS గా ఇచ్చారు. నెల రోజులు వాడే సరికి తను చెపాతీలు చక్కగా తినగలుగుతున్నానని కడుపునొప్పి రావడం లేదని పేషంట్ తెలిపారు. 2016 జూలై లో రెమిడి తీసుకోవడం పూర్తిగా ఆపివేసే నాటికి డోస్ను క్రమంగా OWగా తగ్గించుకొంటువచ్చారు. 2016 డిసెంబర్ నాటికి పేషంటుకు అసిడిటీ, తలనొప్పి, కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోవడంతో రెమిడి తీసుకోవడం మానివేసారు.
సంపాదకుని వివరణ:
అసిడిటీ మరియు తలనొప్పి గోధుమపిండి అంటే ఎలర్జీ వల్లే వచ్చి ఉంటుంది. కనుక మొదట ఎలర్జీకి మందు ఇచ్చిఉంటే వేరే ఇతరత్రా రెమిడి తీసుకోకుండానే తగ్గిపోయి ఉండవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా పేషంటు మన వద్దకు వచ్చినప్పుడు సంశయం లేకుండాను, దాపరికము లేకుండాను రోగలక్షణాలు అన్నింటిని చెప్పవలసిందిగా ప్రోత్సహించాలి.