దెబ్బ తగలడం వలన కలిగిన గాయం 03536...Italy
పునరుద్ధరణ విభాగానికి చెందిన కళాకారిణి ఐన 53 ఏళ్ళ వయసున్న ఒక మహిళ కుడి చేతి చూపుడువేలుకు ఒక చెక్క చీలిక వల్ల గాయం అవడంతో ప్రాక్టీషనర్ను సంప్రదించారు. ఈ గాయం 8 మి.మీ.లోతుగా ఉంది. కళాకారిణిగా ఆమె యొక్క దైనందిన జీవితము మరియు అక్కడ ఉన్నట్టి శీతల వాతావరణం వల్ల గాయం ఐనప్పటినుండి అది తగ్గడం లేదు. 2017 జనవరి 25న ఆమె ప్రాక్టీషనర్ను కలిసే నాటికీ ఈ గాయం ఒక చీలిక మాదిరిగా ఉండి రక్తం కారుతూ మంటగాను, నొప్పిగాను ఉంది. ఐతే ఆమె ఈ గాయం గురించి ఇతర చికిత్స ఏమీ తీసుకోవడం లేదు.
ఆమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC21.5 Dry Sores + CC21.11 Wounds & Abrasions ఈ రెమిడిని ఆల్కహాల్ మీడియం ద్వారా గాయం పైన వేశారు. కొన్ని నిమిషాలలోనే అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఎర్రగా ఉన్న పుండు రంగు మారడం నొప్పి, మంట నెమ్మదించడం, ప్రారంభమయ్యింది. తిరిగి 5 గంటల తర్వాత ప్రాక్టీషనర్ గాయం పైన రెమిడి ఆల్కహాల్ మీడియంతో వేసారు.
రెండు రోజులలో మృత చర్మం సహజంగానే రాలిపోవడం జరిగింది. పేషంటుకు ఇదంతా నమ్మలేని నిజం లాగా అనిపించింది. ఆమె ఇది సైన్స్ కు అందని ఒక అద్భుత విషయం అని వ్యాఖ్యానించింది. ఇకనుండి తన జీవితంలో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలకు వైబ్రియోనిక్స్ పైనే అధారపడతానని చెప్పారు.