Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మనసు క్రుంగుపాటు (క్లినికల్ డిప్రెషన్) 02799...UK


గత ఇరవై సంవత్సరాలుగా వైద్యపరమైన మనసు క్రుంగుపాటుతో బాధపడుతున్న ఒక 61 ఏళ్ల మహిళను వైద్యుడైన భర్త చికిత్సా నిపుణుల వద్దకు 2016 ఆగస్టు 6న తీసుకురావడం జరిగింది. స్నేహితుల ద్వారా వైబ్రియానిక్స్ చికిత్స గురించి తెలుసుకొని చివరి ఆశగా చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె భయస్తురాలని, ఇతరులతో సంభాషించడం ఆమెకు ఇబ్బందికరమని, OCD (ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) మరియు ఇతర మానసిక రుగ్మతలతో భాధపడుతోందని రోగి యొక్క భర్త వైబ్రో నిపుణులకు చెప్పారు. f trashcans on the roadside. నిజానికి వారి జీవితంలో కొద్దిపాటు ఆనందం కూడా ఉండేది కాదు. ఇతరుల వలె జీవితాన్ని సాధారణముగా గడపలేక పోయేవారు. ఒక సాధారణ మహిళగా కనపడే ఆమె భయస్తురాలని చికిత్సా నిపుణులు కనిపెట్టారు. అంతే కాకుండా తన మనస్థితి గురించి చర్చ జరిగే సమయంలో రోగికి అసౌకర్యం కలగడం వైబ్రో నిపుణులు గమనించారు. 

రోగి క్రింది అల్లోపతి మందులను తీసుకునేది: క్రుంగుపాటు కు సిటాలోప్రాం 10 mg మరియు బైపోలార్ డిసార్డర్ కు ఉపయోగించే కేవెషియాపైన 200 mg . ఈ మందులను తీసుకునున్నప్పటికీ ఆమె యొక్క ఆరోగ్యం క్షీణించిందే కానీ మెరుగుపడలేదు.

రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC4.2 Liver & Gallbladder tonic + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities...QDS

మూడు వారాల తర్వాత రోగి యొక్క మనస్థితిలో  25% మెరుగుదల కనబడినట్లు మరియు ఆమె కొంత ఆనందంగా ఉంటున్నట్లు భర్త తెలిపారు. అల్లపతి మందుల యొక్క దుష్ప్రభావాలను ఎరిగిన భర్త వాటి వాడకాన్ని తగ్గించాలని ఆశపడ్డారు. చికిత్సా నిపుణులు అల్లోపతి మందులను 10 % తగ్గించమని మరియు వై బ్రో మందును QDS మోతాదులో తీసుకోమని సలహా ఇచ్చారు

రెండు వారాల తర్వాత 50% మెరుగుదల ఏర్పడినట్లు తెలిసింది. భయం తొలగిపోవడంతో ఆమె కుటుంభ సభ్యులతో ఇబ్బంది లేకుండా ఆనందముగా కలిసి జీవించడం ప్రారంభించింది. అందువలన అల్లోపతి మందు యొక్క మోతాదు 20% తగ్గించబడింది. 

రెండు వారాల తర్వాత 60 % మెరుగుదల ఏర్పడి అల్లోపతి మందుల యొక్క మోతాదు 25% తగ్గించబడింది. ఇంటిలో పనులు ఆనందముగా చేసుకోగలుగుతున్నట్లు ఆమె చికిత్సా నిపుణులకు తెలపడం జరిగింది. మరో రెండు వారాల తర్వాత ఆమెకు 70% ఉపశమనం కలిగడంతో అల్లోపతి మందుల యొక్క మోతాదు 50 % తగ్గించబడింది.

మూడు వారాల తర్వాత ఆమెకు 90% నయమైంది. ఆమె యొక్క ప్రవర్తన సాధారణ స్థితికికి చేరుకుంది. అల్లోపతి మందుల మోతాదు 75% కి తగ్గించడం జరిగింది. 2016 డిసెంబర్ 2న ఆమె 100% నయమైంది. ఇంత ఆనందాన్ని తాను ఎప్పుడు అనుభవించలేదని ఆ మహిళ తెలిపింది. పిరికితనం పూర్తిగా తొలగిపోయినట్లుగాను ఆమె తెలిపింది. డిసెంబర్ 16 న ఆమె అల్లోపతి మందులను పూర్తిగా ఆపినట్లు, ఇంక వాటిని వేసుకొనే అవసరం లేదన్న అద్భుతమైన వార్తను చికిత్సా నిపుణులకు ఎంతో ఆనందముతో తెలిపింది. అతి తక్కువ సమయంలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసిన రోగి యొక్క భర్త ఎంతో సంబర పడ్డారు. వైబ్రో మందు ఆపై పదిహేను రోజులకు  TDS మోతాదుకు తగ్గించబడింది. 2017 జనవరి నాటికి వైబ్రో మందును BD మోతాదులో మరో ఆరు నెలల వరకు తీసుకోవడం కొనసాగిస్తుంది.

చికిత్సా నిపుణుల యొక్క వ్యాఖ్యానము
నేను ఎన్నో విజయవంతమైన కేసులను చొసి ఉన్నాను కానీ ఈ కేసు అతి తక్కువ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ కేసులో రోగి యొక్క భర్త ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రోగియైన భార్యకు మందులను శ్రద్ధ మరియు ప్రేమతో వేయడంతో ఆమెకు వేగంగా ఉపశమనం కలిగింది.

సంపాదకుడి వ్యాఖ్యానం:

అనిగియున్న కోపాన్ని తొలగించేందుకు లివర్ టానిక్ చేర్చబడింది మరియు భయాన్ని తొలగించేందుకు ఎమెర్జెన్సీ మరియు కిడ్నీ టానిక్ చేర్చబడింది.