చాతి పై గాయం 11578...India
చాతి పై నొప్పితో బాధపడుతున్న ఒక 9 ఏళ్ల పాపను చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. నాలుగు నెలల క్రితం పాఠశాల వద్ద ఒక బంతి తగిలి పాపకు చాతి పై గాయం ఏర్పడింది. పాపకు రొమ్ము వద్ద వాపు ఏర్పడి నొప్పి కలిగింది. పాపను వైద్యుడు వద్దకు తీసుకు వెళ్ళలేదు.
క్రింది మందులు పాపకు ఇవ్వబడినాయి:
CC3.1 Heart tonic + CC3.7 Circulation + CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC20.2 SMJ pain + CC20.7 Fractures...QDS
ఒక వారం తర్వాత పాపకు వాపు పూర్తిగా తగ్గింది కానీ నొప్పి 50 % మాత్రమే తగ్గింది. మరొక వారం రోజులలో పాపకు నొప్పి పూర్తిగా తగ్గింది. ఆపై రెండు వారాల వరకు మందును BD మోతాదులో పాపకు కొనసాగించమని చెప్పబడింది. పాపకు పూర్తిగా తగ్గడంతో వైబ్రో మందు ఆపబడింది.
సంపాదకుని వ్యాఖ్యానము:
ఛాతీపై నొప్పి గాయం వల్ల కలిగింది కాబట్టి గుండెకు సంబంధించిన మందులను చేర్చే అవసరం లేదు.