కళ్ళు దురద మరియు మంట 01001...Uruguay
ఒక 57 ఏళ్ల మహిళకు నాలుగు సంవత్సరాల నుండి రెండు కళ్ళల్లోనూ దురద, మంట మరియు అలసట వంటి సమస్యలు ఉండేవి. ఆమె కంప్యూటర్ వద్ద ఎక్కువ సమయం గడపడం ఈ రోగ సమస్యలకు దారి తీశాయి. నాలుగు సంవత్సరాల నుండి ఆమె అల్లోపతి చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ఆంటీ అలెర్జీ మందులు మరియు కంటి చుక్కలు ఇవ్వబడినాయి కానీ వాటి ద్వారా ఆమెకు ఉపశమనం కలుగలేదు.
2016 ఆగస్టు 8 న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC7.1 Eye tonic + CC7.3 Eye infections + CC7.6 Eye injury + CC15.1 Mental & Emotional tonic…TDS
ఆ మహిళ అల్లోపతి కంటి చుక్కలతో పాటు వైబ్రో మందును కూడా తీసుకునేది. ఆగస్టు 18 న రోగి యొక్క లక్షణాలలో 20% మెరుగుదల ఏర్పడింది. ఐదు వారాల తర్వాత 60% మెరుగుదల ఏర్పడింది. డిసెంబర్ 15 నాటికి రోగి యొక్క కంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఆమె అల్లోపతి మందులను తీసుకోవడం ఆపి వైబ్రో మందును TDS మోతాదులో తీసుకుంది. ఆమె కంప్యూటర్ పై తన పని ఇబ్బంది లేకుండా చేసుకోగలిగింది. 2016 డిసెంబర్ 29 న మందు యొక్క మోతాదు రెండు వారాలకు BD కి ఆపై రెండు వారాలకు OD, ఆ తర్వాత 2017 ఫిబ్రవరి 15 వరకు వారానికి మూడు సార్లు (3TW) కి తగ్గించబడింది. ఆమె యొక్క కంటి సమస్యలు తిరిగి కలగలేదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది.