మల్టిపుల్ (అనేక సార్లు) స్ట్రోక్స్ , వినికిడి లోపం మరియు జ్ఞ్యాపక శక్తి క్షీణత 03535...USA
ఆశుపత్రి నుండి డిస్చార్జ్ అయిన ఒక 89 సంవత్సరాల వృద్ధుడను వైబ్రో చికిత్సా నిపుణులు వెళ్లి చూడటం జరిగింది. ఆ వృద్ధుడు తాను బాధపడుతున్న బలహీనత, వినికిడి లోపం మరియు జ్ఞ్యాపక శక్తి క్షీణత వంటి సమస్యలకు చికిత్సా నిపుణులను వైబ్రో చికిత్సను కోరటం జరిగింది. ఈ సమస్యలకు రోగి ఏ విధమైన మందులను తీసుకోవటం జరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో రోగికి అనేక గుండెపోట్లు మరియు అనేక స్ట్రోక్స్ (రక్తక్షయం కారణంగా) కలిగటంతో రోగి రక్తాన్ని పలచపర్చే మందులను తీసుకుంటున్నారు. దీని కారణంగా రోగికి దీర్ఘకాలిక రక్తహీనత సమస్య ఏర్పడడంతో తరచుగా ఆశుపత్రిలో హీమోగ్లోబిన్ యొక్క(రక్తగోళకము) స్థాయిని మెరుగుపర్చేందుకు, రక్తంలో ద్రవం ఎక్కించడం జరిగేది. రోగికి సహాయం లేకుండా నడవటం మరియు నిలబడటం ఇబ్బందికరంగా ఉండేది.
2015 నవంబర్ 2 న రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
#1. CC3.5 Arteriosclerosis + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC20.3 Arthritis…BD
వైబ్రో చికిత్స తీసుకుంటున్న సమయంలో రోగి రక్తాన్ని పలుచపరచే మందును తీసుకోవటం కొనసాగించారు. ఒక నెల తర్వాత వినికిడి లోపానికి క్రింది మందు ఇవ్వబడింది:
#2. CC5.2 Deafness + #1...BD
గత పది సంవత్సరాల నుండి రోగి అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ సమస్యలకు మందులను తీసుకుంటున్నారన్న విషయం chikithsa నిపుణులకు రెండు వారాల తర్వాత తెలిసింది. అతని రక్తపోటు 125/౭౫ ఉంది అయితే అతని HbA1c 8.7% ఉండటం తో అల్లోపతి చికిత్స తీసుకుంటున్నప్పటికీ చక్కెర స్థాయి అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఈ లక్షణాల కొరకు క్రింది మందులు ఈ రోగికి ఇవ్వడం జరిగింది:
#3. CC3.3 High Blood Pressure + CC6.3 Diabetes + #2...BD
2016 జనవరి 15 న రోగి యొక్క ఇంటిలో జరిగిన ఒక విందులో కుటుంభ సభ్యులు మరియు మిత్రులు రోగి యొక్క ఆరోగ్య స్థితిలో ఏర్పడిన మెరుగుదలను చూసి ఆశ్చర్య పడ్డారు. అంతకు ముందు పది నిమిషాల కంటే అధిక సమయం కూర్చోలేకపోయిన రోగి విందులో ఐదు గంటల పాటు కూర్చొని కార్యక్రమాలను చూసి ఆనందించగలిగారని రోగి యొక్క కుమార్తెలు చికిత్సా నిపుణులకు తెలిపారు.
అంతేకాకుండా రోగి యొక్క జ్ఞ్యాపక శక్తి, వినికిడి శక్తి మరియు గమన శక్తిలో మెరుగుదల ఏర్పడినట్లుగా రోగి యొక్క కుమారుడు గమనించి చికిత్సా నిపుణులకు తెలపడం జరిగింది. ఏప్రిల్ లో #3 యొక్క మోతాదు OD కి తగ్గించబడింది. 2016 జూన్ నాటికి రోగి యొక్క వినికిడి శక్తి 80% మరియు శక్తి స్థాయిలు 100% మెరుగుపడ్డాయి.
రక్తపోటు మరియు డయాబెటిస్ కు తీసుకుంటున్న అల్లోపతి మందులతో పాటు వైబ్రో చికిత్సను రోగి కొనసాగించారు. 2016 డిసెంబర్ లో చేసిన HbA1c పరీక్ష ద్వారా రక్తంలో చక్కెర స్థాయి మెరుగుపడినల్టు తెలిసింది. రోగి ఇప్పుడు సహాయం లేకుండా నడవగలుగుతున్నారు.
2017 జనవరి నాటికి రోగి ఆరోగ్యంగా ఉన్నారు. వైబ్రో చికిత్స ప్రారంభించిన సమయం నుండి రోగికి ఆశపత్రిలో చేర్చే అవసరం ఒక సారి కూడా రాలేదు. రోగి యొక్క ఆరోగ్యం మెరుగుపడడానికి వైబ్రియానిక్స్ చికిత్స మాత్రమే కారణమని రోగి యొక్క కుటుంభ సభ్యులు నమ్ముతున్నారు.
రోగి యొక్క కుమారుడి వ్యాఖ్యానం:
సాధారణంగా ఆరోగ్యంగా ఉండే మా తండ్రిగారికి గత ఐదు సంవత్సరాలుగా ఆరోగ్య స్థితి క్షీణించింది. ఆయన దైవంపై అపారమైన భక్తి విశ్వాసాలు గలవారు. ఆయన ఆరోగ్యంగా ఉన్న రోజులలో అనేక మందికి హోమియోపతి మందులను ఉచితంగా ఇవ్వడం ద్వారా వారికి సహాయ పడేవారు. వైబ్రియానిక్స్ ద్వారా ఆయన ఆరోగ్యం మెరుగుపడడం చూసిన మాకు ఎంతో ఆనందం కలిగింది. వైబ్రియానిక్స్ చికిత్స ప్రారంభించిన సమయం నుండి మా తండ్రిగారిని ఆశపత్రిలో చేర్చే అవసరం రాలేదు. ఆరోగ్యం మెరుగుపడిన కారణంగా ఆయన ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు.