ఆహార రుగ్మతలు 11577...India
ఒక 60సంవత్సరాల మహిళ హటాత్తుగా ఆహారం పైన విరక్తి పెంచుకొని అన్నం, నీరు తీసుకోవడం మానేసింది. 3 రోజుల తర్వాత ఆమెను అత్యంత బలహీన స్థితిలో హాస్పిటల్లో ఎడ్మిట్ చేసారు. ఎన్ని టెస్టులు చేసినప్పటికీ రోగమేమిటో అంతు చిక్కలేదు. కొన్ని మందులు రాసిచ్చి ద్రవ పదార్దాలు, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోమని చెప్పారు. కానీ ఆమె బాగా విరక్తిచెంది ఉండడంతో కనీసము మందులు తీసుకోవడానికి కూడా నిరాకరించారు. కుటుంబ సభ్యుల బలవంతం మీద కేవలం కొద్దిగా నీరు మాత్రమే తీసుకుంటున్నది. రెండు రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసారు, ఆమె కుటుంబ సభ్యులకు ఇక ఆమె పైన ఆశలన్నీ వదులుకున్న నిస్సహాయ స్థితి లో సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఆమె కూడా ఈ రెమిడి వాడడానికి ఒప్పుకోవడంతో 8 ఏప్రిల్ 2016 న, క్రింది కొమ్బో ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC15.4 Eating disorders...QDS నీటితో
కేవలం రెండు రోజులలోనే ఆమెలో మార్పు వచ్చి కొద్దిగా ఆహారం, నీరు తీసుకోవడం ప్రారంభించింది. వారం తర్వాత ఆమె అందరిలాగే ఆహారం నీరు తీసుకోవడమే కాదు మాట్లాడడం, నడవడం కూడా చేయసాగింది. ఏప్రిల్ నెలాఖరుకు ఆమెలో నూరు శాతం మార్పు వచ్చేసింది. రెండు వారల పాటు QDS గానూ అనంతరం రెండు వారల పాటు BD గానూ డోస్ ఇవ్వబడింది. 2016,డిసెంబర్ నాటికీ ఆమె జబ్బు పూర్తిగా మటుమాయమయ్యింది.