రక్త నాళికలు గడ్డకట్టడం (డీప్ వీన్ త్రంబోసిస్ ) 10940...India
2012 లో రక్త నాళికలు గడ్డకట్టే వ్యాధి తో ఒక 33 సంవత్సరాల మహిళ హాస్పిటల్లో చేరింది. వ్యాధి తగ్గినట్లు అనిపించినా 3 సంవత్సరాల తర్వాత మరల తిరగ బెట్టింది .ఆమె వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ ను సంప్రదించింది. ఆమెకు కుడి మోకాలి క్రింద భాగమంతా రాయిలా గట్టిగానూ, తిమ్మిరిగాను ఉంటుంది. దీనివల్ల ఆమెకు నడవడం ఇబ్బందికరంగా ఉండడమేకాక బాసిపెట్టు వేసుకొని కూర్చున్నప్పుడు చాలా బాధగా ఉంటోంది.ఆమె బోధనా వృత్తిలో ఉండడం వల్ల చాలా సమయం నిలిచి ఉండడం, మెట్లు ఎక్కుతూ ఉండడం ఆమెకు ఉన్న బాధను కాస్తా ఎక్కువ చేసింది.
2015 అక్టోబర్ 28 తేదీన క్రింది కొమ్బో ఆమెకు ఇవ్వబడింది.
CC3.1 Heart tonic + CC3.4 Heart emergencies + CC20.4 Muscles & Supportive tissue…TDS.
ఆమె డాక్టర్ ఇచ్చిన మందులను వాడడం లేదు కానీ కొన్ని ఎక్సర్సైజులు మాత్రం చేయసాగింది.
రెండు వారాలు మందులను వాడిన తర్వాత ఆమెకు 60% నివారణ కలిగింది. కానీ భజనల్లో కుర్చొనడం, ఎక్కువ సేపు నిలబడి పాఠాలు చెప్పడం ఇబ్బంది గానే ఉంది. ఆమె అదే మందును రోజుకు రెండు సార్లు వాడవలసినదిగా సూచింప బడింది.
మూడు వారల తర్వాత ఆమెకు 95 శాతం బాధ నివారణ అయ్యింది. ఇప్పుడామె ఎక్కువ సమయం నిలబడడం లో గానీ మెట్లు ఉపయోగించు కోవడంలో గానీ ఇబ్బంది పడడం లేదు. కనుక డోస్ ను నెల రోజుల వరకూ రోజుకు ఒక్కసారికి తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఆమె మందు తీసుకోవడం పూర్తిగా ఆపారు. 2016 డిసెంబర్ నాటికీ ఆమెకు వ్యాధి నుండి పూర్తి విముక్తి లభించింది. ఎప్పుడయినా మరీ ఎక్కువ సమయం నిలబడవలసి వస్తే కొంత ఇబ్బంది ఉంటోంది కానీ విశ్రాంతి తీసుకొంటే తగ్గిపోతుంది.