దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులు 02899...UK
దీర్ఘకాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఒక 58 సంవత్సరాల వ్యక్తి 2014 మే 2 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. 11 సంవత్సరాల క్రితం రోగి తీవ్ర నడుమ నొప్పితో బాధపడిన సమయంలో రేయికి చికిత్స ద్వారా రోగికి ఉపశమనం కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం రోగి యొక్క కుడి మోకాలు నుండి ఒక గడ్డ తీసి వేయబడింది. రోగి యొక్క మోకాలి నొప్పికి ఇది ఒక ముఖ్య కారణం అయ్యుండవచ్చు. గత మూడు సంవత్సరాల నుండి కొంత దూరం నడిచినప్పటికీ రోగికి రెండు మోకాళ్ళలోనూ తీవ్రమైన నొప్పి కలిగేది. దీని కారణం ఆర్త్రైటిస్ అని రోగి అనుమాన పడ్డారు. వైద్యుడుచే ఇవ్వబడిన పారాసిటమోల్ మరియు ఇబుప్రోఫెన్ వంటి మందులను రోగి నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం కలిగేందుకు ఉపయోగించే వారు.
రోగికి క్రింది మిశ్రమాలను ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.2 SMJ pain + CC20.3 Arthritis...TDS
మే 9 నుండి రోగి మందులను తీసుకోవడం ప్రారంభించారు. చికిత్స ప్రారంభమైన రెండు రోజులకు రోగికి రెండవ రకమైన పుల్ అవుట్ ప్రక్రియ ఏర్పడింది (విరోచనాలు). పది రోజుల తర్వాత రోగికి, కొంత దూరం నడిచిన తర్వాత కలిగే మోకాళ్ళ నొప్పులు 25% వరకు తగ్గి రోగికి శక్తివంతంగా అనిపించింది. ఒక నెల తర్వాత మోకాళ్ళ నొప్పులు 75 % తగ్గినట్లు మరియు నొప్పి లేకుండా ఎక్కువ దూరం నడవగలుగుతున్నట్లు రోగి తెలిపారు. ఆపై నాలుగు నెలల తర్వాత రోగికి 100% ఉపశమనం కలిగింది. రోగి వైబ్రో మందును TDS మోతాదులో రెండు నెలలు తీసుకున్నారు. జనవరి 2015 నుండి రోగికి క్రమంగా మందు యొక్క మోతాదు తగ్గించబడింది. రెండు నెలలకు రోగి మందును BD మోతాదులోను, ఆపై రెండు నెలల వరకు OD మోతాదులో మరియు ఆపై ఆరు నెలల వరకు OW మోతాదులో తీసుకోవడం జరిగింది. ఈ సమయంలో రోగికి మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గి తిరిగి రాకపోవడంతో 2015 అక్టోబర్ లో చికిత్స ఆపబడింది. వై బ్రియానిక్స్ చికిత్స ప్రారంభించిన తర్వాత రోగి ఈ సమస్య కొరకు అల్లోపతి మందులను ఉపయోగించలేదు.
2016 జనవరిలో అతిశీతలమైన వాతావరణం కారణంగా రోగికి కొంత మోకాళ్ళ నొప్పి కలిగింది. వైబ్రో మందును ఒకసారి (ఒక డోస్) తీసుకోవడంతో రోగికి నొప్పి తగ్గిపోయింది. 2016 ఫిబ్రవరి నాటికి రోగికి 100 % ఉపశమనం కలిగింది.