Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డయాబెటిస్, దీర్ఘకాలిక దగ్గు 02799...UK


ఒక 70 సంవత్సరాల మహిళ రెండు సంవత్సరాల పాటు తీవ్రమైన పొడి దగ్గుతో బాధపడేది. ఆమె తరచుగా ఆంటీబయాటిక్ మందులను తీసుకోవలసి వచ్చేది. వీటి ద్వారా రోగికి తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కలిగేది. ఏడు సంవత్సరాల క్రితం ఆమెకు రక్త చక్కెర స్థాయి అధికంగా ఉందని తెలిసింధి. దాని కారణంగా వైద్యుడు రోగికి వెంటనే ఇన్సులిన్ ప్రారంభించటం జరిగింది. రోగికి పదిహేను సంవత్సరాల నుండి అధిక రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి అయితే అల్లోపతి మందుల ద్వారా ఈ సమస్యలు అదుపులో ఉన్నాయి.

రోగ సమస్యలన్నిటిలోకి రోగి డయాబెటిస్ సమస్య గురించి చాలా ఆందోళన చెందుతూ ఉండేది. ఆమె ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను పాటిస్తూ ఉండేది. డయాబెటిస్ సమస్య ఉందని తెలిసినప్పటినుండి రోగనాశక మరియు వైద్యపరమైన విలువలు అధికంగా ఉండే వేపాకు పొడిని ఆమె ఆహారంలో ఒక భాగంగా చేసుకుంది. క్రమంగా ఆమె కార్డియో (గుండె) కి సంబంధించిన వ్యాయామాలు మరియు యోగా చేయడం ప్రారంభించారు. ఆమె ఉదయం 40 యూనిట్లు మరియు రాత్రిపూట 20 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటూ ఉండేది. అంతేకాకుండా, ఆమె రోజుకి రెండు సార్లు మెట్ఫార్మిన్ 500mg మరియు గ్లిక్లజాయిడ్ 80mg తీసుకునేది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రోగి యొక్క చక్కెర స్థాయి అధికంగా ఉండేది (8-9mmol/L). సాధారణ స్థాయి :6mmol/L

ప్రతిరోజు లాన్సెట్ (శస్త్రాయుధము) మరియు ఇంజెక్షన్ సూది ద్వారా మందులను తీసుకోవడం కారణంగా తీవ్ర నొప్పి కలిగి రోగి ఒత్తిడికి గురియైంది. రోగికి వైబ్రో చికిత్స ద్వారా డయాబెటిస్ నుండి ఉపశమనం కలగాలని అనిపించినప్పటికీ, ఆమె ఎక్కువగా బాధపడుతున్న దగ్గు సమస్యకు ముందుగా చికిత్సను ఇవ్వమని ఆమె కోరింది.

2014 మే 13 న క్రింది మందులు రోగికి ఇవ్వబడినాయి:

దీర్ఘకాలిక దగ్గు సమస్యకు:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…QDS

రెండు నెలల తర్వాత జులై 17 న రోగికి దగ్గు నుండి 50 % ఉపశమనం కలిగినందువలన #1 యొక్క మోతాదు TDS కి తగ్గించబడింది.  రోగికి క్రింది మందులు అదనంగా ఇవ్వబడినాయి:

డయాబెటిస్ కు:
#2. CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic...QDS

ఆపై మూడు వారాలలో రోగికి దగ్గు నుండి 95 % ఉపశమనం కలిగిన కారణంగా #1 యొక్క మోతాదు BDకి తగ్గించబడింది. దీర్ఘ కాలంగా ఆమె బాధపడుతున్న దగ్గు ఇంత అద్భుతంగా తగ్గడంతో ఆమెకు వైబ్రియానిక్స్ చికిత్స యొక్క మహత్వం పై బలమైన విశ్వాసం కలిగి, ఆమె యొక్క చక్కర స్థాయి సాధారణ స్థాయికి చేరుకుంటుందన్న పూర్తి నమ్మకంతో  #2 మందును క్రమం తప్పకుండా తీసుకోవడం కొనసాగించింది. 2015 మార్చ్ లో ఆమె యొక్క రక్త చక్కర స్థాయి సాధారణంగా ఉన్నట్లు తెలుసుకున్న వైద్యుడు, ఉదయం వేళ రోగికి ఇవ్వబడే ఇన్సులిన్ డోస్ ఆపబడింది. 2015 ఏప్రిల్ 16 న సాయంత్రం ఇవ్వబడే డోస్ కూడా ఆపడం జరిగింది. ప్రస్తుతం రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం లేదు అయితే మందులను మౌఖికంగా తీసుకుంటోంది. అంతవరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకోవడం మానేసిన రోగిని చూడని వైద్యుడు ఎంతో ఆశ్చర్యపోయారు మరియు రోగి యొక్క కుటుంభం సభ్యులు ఎంతో ఆనందించారు !

2016 నవంబర్ 15 న రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపి 19 నెలలు పూర్తయ్యాయి మరియు రోగి యొక్క చక్కర స్థాయి సాధారణలో నిలకడగా ఉంది.  ప్రస్తుతం ఆమె #1 మందును BD మోతాదులో మరియు #2 మందును TDS మోతాదులో తీసుకోవడం కొనసాగిస్తోంది. ఆమె డయాబెటిస్ కి సంబంధించిన అల్లోపతి మందులను మౌఖికంగా తీసుకోవడం కొనసాగిస్తోంది.