డయాబెటిస్, డయాబెటిస్ ద్వారా కలిగే పుళ్ళు, వీపు నొప్పి 03516...Canada
2015 జనవరి 15 న, ఒక 40 ఏళ్ల వ్యక్తి టైప్-2 డయాబెటిస్, ఈ సమస్య కారణంగా కలిగిన పుళ్ళు మరియు వీపు నొప్పి వంటి రోగ లక్షణాలకు చికిత్స కోరుతూ వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించారు. గత మూడు సంవత్సరాలుగా రోగి యొక్క చక్కెర స్థాయి అధికంగా(12mmol/L) ఉండటం కారణంగా తక్కువ మోతాదులో మెట్ఫార్మిన్ తీసుకోవడంతో పాటు ప్రతి రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునే అవసరం ఉండేది. అంతే కాకుండా మూడు సంవత్సరాల పాటు కాలిపిక్కయొక్క ముందఱిభాగములో నొప్పితో కూడిన పుళ్ళు ఏర్పడ్డాయి. ఈ పుళ్ళు గుండ్రంగా ఉండేవి మరియు పుండు మధ్యలో ఒక చిల్లు ఉండేది. ఈ సమస్య కొరకు రోగి ఏ విధమైన చికిత్సను తీసుకోలేదు.
2014 శీతాకాలంలో అతను మంచు కప్పు బడిన ఒక రోడ్డుపై పడడంతో అతని టైల్బోను (వెనుకభాగంలో ఉండే ఎముక) విరిగింది. దీని కారణంగా అతనికి తీవ్ర నొప్పి మరియు అసౌకర్యం కలిగాయి. నొప్పి తగ్గేందుకు అతను ప్రతిరోజు పెయిన్ కిల్లర్లు మరియు వారానికి ఒకసారి ఫిజియోథెరపీ చేయించుకునేవారు. అయితే రోగికి వీటి ద్వారా ఉపశమనం కలుగలేదు. రోగి యొక్క బరువు కూడా అధికంగా ఉండేది. రోగి యొక్క జీవన శైలి మరియు ఆహార పద్ధతులు ఆరోగ్యకరమైనవి కావని చికిత్సా నిపుణులకు అర్థమయింది.
రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి
డయాబెటిస్, ఫ్రాక్చర్ అయిన ఎముక మరియు అధిక శరీర బరువు:
#1. CC4.1 Digestion tonic + CC6.2 Hypothyroid + CC6.3 Diabetes + CC13.1 Kidney & Bladder tonic + CC17.3 Brain & Memory tonic + CC20.2 SMJ pain + CC20.7 Fractures...TDS
పుండ్లకు :
#2. CC3.1 Heart tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.5 Dry Sores + CC21.6 Eczema + CC21.11 Wounds & Abrasions...TDS
#3. CC21.5 Dry Sores + CC21.6 Eczema + CC21.11 Wounds & Abrasions, 200 ml ఆలివ్ నూనె లో ఐదు గోలీలను కలిపి పుండ్లపై ప్రతిరోజు రాయాలి
రెండు వారాలలో చక్కెర స్థాయి 9mmol/L కి మరియు ఆపై రెండు వారాల తర్వాత 7mmol/L కి తగ్గిపోయింది. రోగి ప్రతి రోజు వ్యాయాయం చేయడం ప్రారంభించారు మరియు పిండి పదార్థములు తక్కువగా ఉండే మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. #1 తీసుకోవడం ప్రారంభించిన ఒక నెల తర్వాత రోగికి వీపు నొప్పి నుండి 100 % ఉపశమనం కలిగింది. అతను వై బ్రియానిక్స్ మందులతో పాటు అల్లోపతి మందులు మరియు ఫిజియోథెరపీ కొనసాగించారు. #2 తీసుకున్న రెండు నెలలకు రోగికి ఏర్పడిన పుండ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ సమస్యకు రోగి ఇతర మందులను ఉపయోగించలేదు. మార్చ్ నెలాఖరుకు రక్త చక్కర స్థాయి స్థిరబడి 6mmol/L కి చేరుకుంది. ఏప్రిల్ 15 న రోగి యొక్క వైద్యుడు రోగికి ఇన్సులిన్ ఇంజేక్షన్లు తీసుకొనే అవసరం లేదని చెప్పారు మరియు మెట్ఫార్మిన్ యొక్క డోస్ ను తగ్గించారు.
2016 ఫిబ్రవరి లో జరిగిన ఆఖరి సంప్రదింపు సమయంలో రోగి ఇన్సులిన్ లేదా పెయిన్ కిల్లర్లు తీసుకోవడం లేదు. తక్కువ మోతాదులో మెట్ఫార్మిన్ మాత్రమే తీసుకుంటున్నారు. #1 మరియు #2 మందును ఆరోగ్య సంరక్షణ కొరకు OD మోతాదులో తీసుకుంటున్నారు. ప్రేమ మరియు ఓర్పులతో వైబ్రో చికిత్సను అందించినందుకు చికిత్సా నిపుణులకు తమ కృతజ్ఞతలను తెలుపుకున్నారు. శారీరిక ఉపశమనం కలగడంతో పాటు రోగికి ఆత్మవిశ్వాసం పెరిగింది.