డయాబెటిస్, అధిక రక్తపోటు 03535...USA
ఒక 60 మహిళ గత 15 సంవత్సరాలుగా డయాబెటిస్ మెల్లిటస్ మరియు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేది. రోగి యొక్క ఆరోగ్య సమస్యలకు దీర్ఘకాలిక వత్తిడి మరియు టెన్షన్ లు కారణమని తెలిసింధి. చక్కెర వ్యాధి మరియు అధిక రక్తపోటు సమస్యలకు అల్లోపతి మందులను తీసుకున్నప్పటికీ రోగికి చక్కెర స్థాయి 190 మరియు 250 mg /dL మరియు రక్తపోటు 180 /100 గా ఉండేవి. రోగికి తరచుగా తలతిరుగుట సమస్య ఉండటం కారణంగా దినచర్యలు సక్రమముగా చేసుకోలేక పోయేది. అంతేకాకుండా రోగికి పది సంవత్సరాల పాటు అరచేతులు మరియు అరకాళ్ళలో మంట ఉండేది.
2015 డిసెంబర్ 5 న, చికిత్సా నిపుణులను సంప్రదించే సమయంలో రోగి డయాబెటిస్ సమస్య కోసం గేమర్ DS - 2mg (రెండు సార్లు) మరియు రక్తపోటు సమస్యకు టెల్మికైండ్ 40 mg & మెటోలెక్స్ 50 (ఒకసారి) తీసుకునేది.
రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC3.3 High Blood Pressure + CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS in water
రోగి వైబ్రో మందులతో పాటు అల్లోపతి మందులను కూడా తీసుకోవడం కొనసాగించింది. ఒక నెల తర్వాత రోగి యొక్క చక్కెర స్థాయిలో మెరుగుదల ఏర్పడింది అయితే ఆమె యొక్క బీ.పీ అధికంగానే ఉండేది (170 /95 ). మరో నెల రోజులలో చక్కెర స్థాయిలో విశేషమైన మెరుగుదల ఏర్పడింది. ఫాస్టింగ్ మరియు పోస్ట్ ప్రాండియల్ (భోజనం చేసిన తర్వాత) చక్కెర స్థాయిలు 90 మరియు 140 mg /dL కి తగ్గిపోయాయి. రోగికి తలతిరుగుట సమస్య కూడా తగ్గింది. పైగా రోగికి అరచేతులు మరియు అరికాళ్ళలో మంటలు 60% వరకు తగ్గిపోయాయి. చికిత్సా నిపుణుల సలహా పై రోగి వైద్యుడను సంప్రదించడంతో, గేమర్ DS -1mg మాత్ర 0.5 mg కి తగ్గించబడింది. రోగి యొక్క బీ.పీ కూడా తగ్గడం మొదలై 160 /90 కి చేరుకుంది.
నాలుగు నెలల తర్వాత 2016 జూన్లో , రోగి యొక్క చక్కెర స్థాయి (80 మరియు 140 mg /dL ) సాధారణ స్థాయికి చేరుకుంది అయితే బీ.పీ కొంచం అధికంగానే ఉండేది (145/90). గత పది సంవత్సరాల నుండి రోగిని పర్యవేక్షిస్తున్న వైద్యుడు ఇంత అద్భుతమైన ఫలితాలను చూసి ఆశ్చర్యపడ్డారు. గేమర్ DS -1mg యొక్క మోతాదును తిరిగి OD కి తగ్గించారు. బీ.పీ కోసం తీసుకుంటున్న మెటోలెక్స్ మాత్ర ఆపబడింది. తలతిరుగుట, అరచేతులు మరియు కాళ్ళ మంటలలో 100% ఉపశమనం ఏర్పడింది. రోగికి శక్తి పెరగడంతో తన రోజువారీ కార్యక్రమాలను మరియు సమాజ సేవను ఇబ్బంది లేకుండా చేసుకోగలిగింది. దీని కారణంగా వైబ్రియానిక్స్ మందు యొక్క మోతాదు BDకి తగ్గించబడింది.
అక్టోబర్ నాటికి ఆమె చక్కెర స్థాయి మరియు బీ.పీ (130/80 ) సాధారణ స్థాయికి చేరుకున్నాయి. రక్తంలో చక్కెర స్థాయి మరియు బీ.పీ సాధారణ స్థాయిలో నిలకడగా ఉన్నందువల్ల వైద్యుడు సలహా పై అల్లోపతి మందులను పూర్తిగా ఆపేందుకు ఆమె ఎదురుచూస్తున్నది. గతంలో ఆమెకున్న రోగ లక్షణాలు తిరిగి ఏర్పడలేదు. ఆమె అప్పుడప్పుడు తీపి పదార్థాలను తీసుకుంటోంది. చక్కెర స్థాయి తగ్గితే ఉపయోగపడే విధంగా ఆమె తన వద్ద చాకోలెట్ లను ఎల్లపుడు ఉంచుకుంటోంది. ఆమె వైబ్రో మందును క్రమం తప్పకుండా తీసుకుంటోంది. పూర్తిగా నయంకావడంతో ఆనందించి ఆమె మరో ఇద్దరు రోగులను చికిత్సా నిపుణల వద్దకు చికిత్స కొరకు పంపింది.
రోగి యొక్క వ్యాఖ్యానం :
వైబ్రియానిక్స్ చికిత్స ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. డయాబెటిస్ మరియు అధిక రక్తపోటు సమస్యలను తగ్గించేందుకు నాకు ఈ మందులు అద్భుతంగా సహాయపడినాయి. దైవానికి మనసారా నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం ఆరోగ్యం గురించిన చింతలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నాను.