Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ఎముకల విరుపు, తలపై గాయాలు మరియు తీవ్ర భాధ 00512...Slovenia


2014 నవంబర్ 21న కారు ప్రమాదం భాధితుడైన ఒక 21 ఏళ్ల వ్యక్తిని స్లోవినియాలో ఉన్న మేర్బోర్ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తలపై ఏర్పడిన తీవ్ర గాయాల కారణంగా సబ్ డ్యూరెల్ హెమటోమా ( మెదడులో నెత్తురు గడ్డ), మెదడులో ఎడీమా (మెదడులో నీరుపట్టడం) ముఖంలో మరియు కపాలము అడుగు భాగంలో అనేక ఎముకల విరుపు వంటి సమస్యలు ఏర్పడి రోగి స్పృహ కోల్పోయారు. ఆసుపత్రిలో ప్రధాన నర్సు తక్షణ సహాయం కోరుతూ చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. రోగిని ఆసుపత్రిలో చేర్చిన అరగంట సమయంలో వైబ్రేషన్ల ప్రసరణ ప్రారంభించబడింది. మరుసటి రోజు, ఒక వేళ రోగి బ్రతికినా, ఒక వెజిటేటివ్ స్థితిలో మాత్రమే జీవించ గలుగుతాడన్న వైద్యులు యొక్క అభిప్రాయాన్ని చికిత్సా నిపుణులకు తెలుపబడింది. అయితే, ఆమెకు రోగి పూర్తిగా కోలుకుంటాడన్న విశ్వాసంతో ఆమె చికిత్సను కొనసాగించింది. రోగిని ఆపై నెల రోజుల వరకు ఐ సి యూ లో ఉంచడం జరిగింది. 2014 నవంబర్ 21న, క్రింది మిశ్రమాలను ప్రసరణ (బ్రాడ్కాస్టింగ్) చేయడం జరిగింది: (గమనిక: రోగికి చికిత్స ప్రసరణ ద్వారా మాత్రమే ఇవ్వడం జరిగింది).

#1. CC10.1 Emergencies...OD ఒక గంట సమయం వరకు. ఆ తర్వాత నాలుగు రోజుల వరకు TDS మోతాదులో ప్రసరణ కొనసాగించబడింది. ఆపై పది రోజుల వరకు మోతాదును ODకి తగ్గించడం జరిగింది (ప్రతి డోసు, ఇరవై నిమిషాల వరకు). 

#2. CC20.7 Fractures + CC21.1 Skin tonic...TDS

డిసెంబర్ 1 న , #2 మిశ్రమం క్రింది విధముగా మార్చబడింది:

#3. CC9.2 Infections acute + #2...TDS

వైద్య-ప్రేరిత కోమా లో మూడు వారాలు రోగి ఉంచబడ్డారు. ఆ తర్వాత డిసెంబర్ 14 న, రోగి యొక్క ఆరోగ్య స్థితిలో మెరుగుదల కనపడటం ప్రారంభించింది. రోగి నొప్పికి స్పందించటం ప్రారంభించాడు. ఒక వారం తర్వాత రోగి కళ్ళు తెరిచాడు మరియు వేళ్ళను కదిలించారు. దీని తర్వాత రోగిని ఐ సి యూ నుండి న్యూరో సర్జెరీ యూనిట్ కు తరలించారు. తదుపరి నెలలో రోగి యొక్క ఆరోగ్యం మరింత మెరుగుపడింది. అతని శరీరంలో కదలిక శక్తి పెరిగింది. 2015 జనవరి మూడో వారంలో రోగి వ్రాయడం మరియు ఘన పదార్థాలను ఆహారంగా తీసుకోవటం ప్రారంభించాడు ! 

ఫిబ్రవరి 1 న, #3 యొక్క స్థానంలో క్రింది మిశ్రమం ఇవ్వబడింది:

#4. CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC17.3 Brain & Memory tonic + CC20.7 Fractures…BD

ఫిబ్రవరి 9 న రోగిని లియూబ్లియన లో ఒక పునరావాస కేంద్రంలో మూడు వారాల వరకు చేర్చారు. ఈ సమయంలో రోగి తన దినచర్యలన్ని తనకు తాను చేసుకోవటం ప్రారంభించారు. మార్చ్ నెల ప్రారంభంలో రోగి మెడకి ఆధారంగా పెట్టిన ప్రాప్ ను తీసేశారు. ఒక వారం తర్వాత రోగి యొక్క కాలుకి శస్త్రచికిత్స చేయటం జరిగింది. ఏప్రిల్ నెలలో రోగి ఇతరుల సహాయంతో క్రమంగా అడుగులు వేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత సహాయాం లేకుండా నడవటం ప్రారంభించాడు. అతను సులభంగా ఇతరులతో సంభాషించ గలిగాడు మరియు అతని జ్ఞ్యాపక శక్తి మెరుగుపడింది. జూన్ నాటికి రోగి మరింత స్థిరంగా నడవటం ప్రారంభించాడు అయితే రోగికి నడిచే సమయంలో తలతిరిగేది.

జూన్ 24 న #4 యొక్క స్థానంలో క్రింది మిశ్రమం ఇవ్వబడింది:
#5. CC3.7 Circulation + CC17.3 Brain & Memory tonic…BD

జూన్ 30 న రోగి అల్లోపతి మందులను తీసుకోవటం ఆపి, ప్రతి వారం వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించటం ప్రారంభించాడు. తదుపరి రెండు నెలలు అతను ఎక్కువగా వ్యాయాయం చేయటం ప్రారంభించాడు. సెప్టెంబర్ నాటికి అతను సహాయాం లేకుండా మెట్లు ఎక్కటం ప్రారంభించాడు.అయితే అతనికి మెట్లు ఎక్కే సమయంలో కొంత తలతిరిగటం సమస్య ఉండేది. అతను కర్రను పట్టుకొని నాలుగు కిలోమీటర్లు నడవగలిగాడు.

2016 మార్చ్ 2 న, #5 కు బదులుగా క్రింది మిశ్రమం ఇవ్వబడింది:
#6. CC17.3 Brain & Memory tonic + CC18.3 Epilepsy…BD

వారానికి రెండు సార్లు ఒక స్కూల్ మైదానంలో 4 కిమీ పరిగెత్త గలుగుతున్నట్లుగా జులై 17న రోగి చికిత్సా నిపుణులకు తెలిపారు. అతనికి ముందు పళ్ళు అమర్చబడ్డాయి మరియు అతను సాధారణంగా మాట్లాడటం ప్రారంభించాడు. అతను తీసుకుంటున్న చికిత్స పై అతని యొక్క ఆలోచన ఏమిటని చికిత్సా నిపుణులు రోగిని అడిగినప్పుడు, చికిత్స ఇంకా పూర్తి కాలేదని అతను ధృడంగా చెప్పాడు.

ఆగస్టు 4 న #6 కు బదులుగా క్రింది మిశ్రమం ఇవ్వబడింది:

#7. NM25 Shock + NM104 Tops + NM109 Vision + BR18 Circulation + BR19 Ear + SM9 Lack of Confidence + SR264 Silicea + SR449 Wild Rose + SR450 Willow + SR465 CN2: Optic…BD

నవంబర్ 1న జరిగిన సంప్రదింపులో, రోగి యొక్క ఆరోగ్యం పూర్తిగా నయమైనట్లుగా రోగి తెలిపారు. అతను పరిగెత్తటం, నడవటం మరియు సైక్లింగ్ వంటివి చేయగలుగుతున్నాడు. అయితే అతను ఎత్తుగా ఉన్న ప్రదేశాలంటే భయపడేవాడు. అతను #7 తీసుకోవటం కొనసాగిస్తున్నాడు.

రోగి యొక్క తల్లి ఇచ్చిన వ్యాఖ్యానము

సుమారు 18 నెలల తర్వాత మా కుమారుడు మాకు తిరిగి ఇవ్వబడ్డాడని చెప్పవచ్చు. బంధువులు మరియు స్నేహితుల యొక్క సహాయంతో మా అబ్బాయి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. ప్రతి విషయాన్ని అతను తిరిగి నేర్చుకోవటం ప్రారంభించాడు. ప్రమాదం జరిగిన రోజు నుండి మా అబ్బాయి కి వైబ్రో చికిత్స ద్వారా సహాయం అందించిన చికిత్సా నిపుణులు00512 కు మా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాము. ప్రతి క్షణం చికిత్సా నిపుణులు వైబ్రేషన్ల ప్రసరణను కొనసాగించటం ద్వారా అతని ప్రాణ శక్తిలో సమతుల్యత ఏర్పడేందుకు సహాయపడ్డారు. ఈ అనుభవం కారణంగా, సార్వజనిక శక్తి ద్వారా మేము ఎల్లప్పుడూ మీతో సంపర్కంలో ఉంటాము.

సంపాదకుని వ్యాఖ్యానము:
ఇటువంటి అద్భుతమైన ఫలితానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి: రోగికి పూర్తిగా నయంకావాలన్న ధృడమైన సంకల్పము మరియు వైబ్రో చికిత్స ద్వారా రోగిని నయంచేయవచ్చని చికిత్సా నిపుణులకు ఉన్న సంపూర్ణ విశ్వాసం.