ఎప్లాస్టిక్ అనీమియా(కణజాలములు వృద్ధి కానందున కలిగిన రక్తహీనత) 11274...India
ఏడు సంవత్సరాలుగా ఎప్లాస్టిక్ అనీమియా (కణజాలములు వృద్ధి కానందున కలిగిన రక్తహీనత) వ్యాధితో బాధపడుతున్న ఒక 47 సంవత్సరాల మహిళ 2011 జనవరి 25 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ లో ఈ వ్యాధికి చికిత్స చేయించుకునేది. రోగికి శరీరమంతయు తీవ్ర నొప్పి ఉన్న కారణంగా ఆమె రోజుకి ఆరు పెయిన్ కిల్లర్ మాత్రలను తీసుకునేది. రోగికుండే ఇతర రోగ లక్షణాలు : చలిగా ఉండడం మరియు మూత్రంలో రక్తం. ఆమె శరీరమంతయు చీము కారే గాయాలతో నిండియుండడం కారణంగా ఆమెకు భరించలేని దురద కలిగింది. ఆమె అల్లోపతి మందులను తీసుకుంది గాని ఫలితం లభించలేదు.
క్రింది మిశ్రమాలను రోగికి ఇవ్వడం జరిగింది:
#1. CC10.1 Emergencies…BD
రోగి అల్లోపతి మందులతో పాటు వైబ్రో మందులను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సాయిబాబా రోగికి కలలో కనిపించి CC21.11 ఇవ్వవమని చెప్పారు.
ఫిబ్రవరి 25 న చికిత్సా నిపుణులు ఈ మిశ్రమాన్ని #1 తో పాటు చేర్చి ఇవ్వడం జరిగింది:
#2. CC21.11 Wounds & Abrasions + #1…TDS
ఒక వారం తర్వాత రోగికి దురద తీవ్రంగానే ఉంది. అయితే చికిత్సా నిపుణులు రోగిని స్వామి సిఫార్సు పై ఇచ్చిన మందు కాబట్టి #2 మందును కొనసాగించమని సలహా ఇచ్చారు. ఒక నెల రోజుల్లో ఆమె చర్మం పూర్తిగా నయమైంది. ఆ తర్వాత తిరిగి బాబా నిర్దేశం ద్వారా చికిత్సా నిపుణులు పైన ఇవ్వబడియున్న మందులో CC3.1ను చేర్చి ఇచ్చారు.
రోగికి ఇవ్వబడిన మిశ్రమం:
#3. CC3.1 Heart tonic + #2…TDS
ఈ మిశ్రమాన్ని తీసుకున్న తర్వాత రోగి యొక్క ఆరోగ్యం వేగంగా మెరుగుపడింది. 2011 ఏప్రిల్ 24 న రోగికి ఎప్లాస్టిక్ అనీమియా పూర్తిగా నయమైంది. క్యాన్సర్ సెంటర్ లో చేయబడిన నిదానాత్మక పరీక్షల ద్వారా రోగి వైద్యులను తిరిగి సంప్రదించే అవసరం లేదని తెలిసింది. వైబ్రో మందు క్రమంగా తగ్గించబడి ఆ తర్వాత పూర్తిగా ఆపబడింది.
చికిత్సా నిపుణుల వ్యాఖ్యానం: గతంలో అనారోగ్యం కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లేవారు కాదు. అయితే 2011 ఏప్రిల్ లో మొదటి సారి ఆమె తన అమ్మాయితో కలిసి సాయి మందిరానికి వెళ్లి భజనలు హాజరు అయ్యి స్వామికి హారతి ఇచ్చినందుకు ఆమె ఎంతో ఆనందించారు.