బెడ్ వెట్టింగ్ (నిద్ద్రలో పక్కను తడపటం) 11276...India
ప్రతిరోజు నిద్రలో మూత్ర విసర్జన చేసే లక్షణం గల ఒక ఆరు సంవత్సరాల బాలుడి యొక్క తల్లి తండ్రులు 2015 నవంబర్ 9 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. గత ఐదు ఏళ్లగా అల్లోపతి, ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్సలను తీసుకున్నప్పటికీ సఫలితాలు లభించలేదు. ఈ సమస్య కారణంగా మరియు తల్లి తండ్రులు తన తోబుట్టువులతో పోల్చడంతో ఆ పిల్లవాడు నిరాశ నిస్పృహలకు గురయ్యాడు.
ఆ పిల్లవాడికి క్రింది మందులను ఇవ్వడం జరిగింది:
CC12.2 Child tonic + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…5TD
ఒక వారంలో పిల్లవాడుకు నిద్రలో పక్కను తడపడం సమస్య పూర్తిగా తగ్గిపోయింది (100%). తల్లి తండ్రులతో పాటు ఆ పిల్లవాడు ఎంతో ఆనందించారు. ఆపై ఐదు వారాల సమయంలో మందు యొక్క మోతాదు క్రమంగా తగ్గించబడింది. ఏడు నెలల తర్వాత 2016 జులై లో చికిత్సా నిపుణులను కలిసిన సమయంలో పిల్లవాడికి బెడ్ వెట్టింగ్ సమస్య తిరిగి రాలేదని తెలిపారు.