అధిక రక్తపోటు, వెరీకోస్ అల్సర్లు (సిరాజ వ్రణములు) 11276...India
ఏడు సంవత్సరాల నుండి రక్తపోటు మరియు పదిహేను సంవత్సరాల నుండి రెండు కాళ్లల్లో వెరికోస్ అల్సర్లు తో బాధపడుతున్న ఒక 55 సంవత్సరాల మహిళ 2015 నవంబెర్ 14 న చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఆ సమయంలో రోగి యొక్క వెరీకోస్ పుండ్ల నుండి రక్తం మరియు తెల్లటి ద్రవము కారడంతో పాటు నొప్పిగా కూడా ఉంది. అంతేకాకుండా రోగికి కాళ్ళ వాపులు కారణంగా నడవడం ఇబ్బందికరంగా అనిపించింది. వైద్యుడు సలహా పై ఆమె కాళ్లపై కట్టు కున్నది. ఆమె యొక్క బీపి 220 /100 . అంతకు ముందు రోగి ఈ రెండు సమస్యలకు అల్లోపతి, ఆయుర్వేదం మరియు హోమియోపతి చికిత్సలను తీసుకునేది గాని ఉపశమనం కలగలేదు.
క్రింది మిశ్రమాలను రోగికి ఇవ్వడం జరిగింది:
#1. CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation + CC15.1 Mental & Emotional tonic...5TD
#2. CC8.6 Menopause + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia…5TD
చికిత్స ప్రారంభించిన ఒక నెల వరకు వైబ్రో మిశ్రమాలతో పాటు రోగి అల్లోపతి మందులను కూడా తీసుకోవడం జరిగింది. వారం రోజుల తర్వాత రోగి యొక్క బీ.పి సాధారణ స్థాయికి చేరుకుంది గాని ఆమె #1 ను 5TD మోతాదులో తీసుకోవడం కొనసాగించింది.
డిసెంబర్ 25 న, # 2 ముందుకు బదులుగా # 3 ఇవ్వబడింది:
#3. CC21.11 Wounds & Abrasions + #2...5TD
డిసెంబర్ నెలాఖరుకి రోగి యొక్క ఆరోగ్య స్థితిలో 50% మెరుగుదల ఏర్పడింది. చికిత్సా నిపుణులు రోగి యొక్క కాళ్లకు కట్టిన కట్టును తొలగించమని సలహా ఇచ్చారు.
రెండు నెలల్లో రోగికి వేరికోస్ పుండ్లు 80% వరకు తగ్గిపోయాయి. ఆమె రెండు కాళ్ళు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి మరియు ఆమె సాధారణంగా నడవడం ప్రారంభించింది. అయితే, కాళ్ళ వాపు తగ్గలేదు.
దీని తర్వాత రోగికి ఒక ప్రయాణం చేసే అవసరం వచ్చింది. ప్రయాణించిన తర్వాత రోగికి వేరికోస్ పుండ్లు తిరిగి ఏర్పడ్డాయి. అందువలన జనవరి 25న రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి
#4. CC10.1 Emergencies + #1...QDS ఒక నెల వరకు, అందువలన #1 ఆపబడింది.
#5. CC17.2 Cleansing…TDS ఏడు రోజుల వరకు
#6. CC3.7 Circulation + CC21.11 Wounds & Abrasions…5TD గాయాలను పసుపు, తులసి, మిరియాల చెట్టు యొక్క కొమ్మ మరియు ఆకులు, వేపాకులు, తమలపాకులు మరియు ఉప్పు కలిపి ఉడికించిన నీరుతో శుభ్రం చేసిన తర్వాత స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలిపి చర్మం పై పూయవలెను.
ఆమె #3 తీసుకోవడం కొనసాగించింది.
మార్పులు చేయబడిన మందులను తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, రోగి యొక్క వాచిన కాళ్ళ నుండి, ద్రవ్యం కారింది. ఇది ఒక అనుకూలమైన సూచనయని వైద్యులు చెప్పారు. క్రమంగా రోగి యొక్క పరిస్థితి మెరుగుపడి, మూడు వారాలలో 40% ఉపశమనం కలిగింది. రక్త ప్రసరణ మెరుగుపడి పసుపు రంగులో ఉన్న పుండ్లు ఎర్రగా మారాయి. ఆమె కాళ్ళ వాపులు 65% వరకు తగ్గిపోయాయి.
ఫిబ్రవరి చివరిలో రోగి యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడిన కారణంగా, #4 యొక్క స్థానంలో #1 ఇవ్వబడింది మరియు #3 మరియు #6 కొనసాగించబడినాయి. మరో రెండు నెలల తర్వాత ఏప్రిల్ లో రోగికి 60 నుండి 70 % మెరుగుదల ఏర్పడింది. ఆగస్టు 20 నాటికి రోగి యొక్క ఆరోగ్య స్థితిలో 85% మెరుగుదల ఏర్పడింది. గాయాలు చాలా వరకు ఎండిపోయి, కొత్త చర్మం రావడం ప్రారంభమయింది. రోగి యొక్క బీ.పి సాధారణ స్థాయిలో నిలకడగా ఉంది. 2016 ఆగస్టు రిపోర్టు లో ఆమె యొక్క బీ.పి 128 /86 అని తెలిసింది. రోగి వ్యాధి నివారణ కొరకు #1 ను తీసుకోవడం కొనసాగిస్తోంది. పూర్తి ఉపశమనం కొరకు #3 మరియు #6 మిశ్రమాలలో CC21.1 చేర్చబడింది. ఆమె గత ఎనిమిది నెలలుగా ఏ విధమైన అల్లోపతి మందులను తీసుకోలేదు.