సోరియాసిస్ (విచర్చిక చర్మరోగము) 11993...India
ఐదు సంవత్సరాల నుండి సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న ఒక 41 ఏళ్ల వ్యక్తి 2014 సెప్టెంబర్ 7 న చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. వ్యాధి లక్షణాలు ప్రారంభమైన సమయంలో రోగి చర్మం పై అలెర్జీ కి సంబంధించిన ఆయింట్మెంట్ (లేపనం) పూయడం జరిగింది. దాని తర్వాత రోగి యొక్క చర్మం ఎర్రగా మారి దురద మొదలై గోక్కోవడం కారణంగా చర్మం ఊడిపోవడం ప్రారంభమైంది. చర్మం పై గాయాలు శరీరమంతయు వ్యాపించడం కారణంగా రోగి ఇతరులను కలిసేందుకు ఇబ్బందిపడేవారు. రోగి అల్లోపతి మరియు ఆయుర్వేద చికిత్సలను ప్రయత్నించారు గాని ఫలితం లభించలేదు. వైబ్రియానిక్స్ ప్రారంభించే ముందు రోగి రెండు చికిత్సలను ఆపడం జరిగింది.
రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.10 Psoriasis…TDS.
రెండు నెలల తర్వాత నవంబెర్ లో రోగికి 75% మెరుగుదల ఏర్పడింది. దురద మరియు చర్మం రాలిపోవడం వంటి సమస్యలు తగ్గిపోయాయి. గాయాల పై కొత్త చర్మం రావడం మొదలయింది. వైబ్రో ప్రారంభించిన ఐదు నెలల తర్వాత 2015 ఫిబ్రవరి 5న రోగికి పూర్తిగా తగ్గిపోయింది. గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. మందు యొక్క మోతాదును క్రమంగా 2015 జూన్ వరకు OW కి తగ్గించడం జరిగింది. ఆపై చికిత్స నిలపబడింది. 2016 ఆగస్టు నాటికి రోగికి చర్మ సమస్య తిరిగి రాలేదు.