Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మూత్రపిండాల్లో రాళ్లు 11993...India


2013 జనవరిలో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లుగా వైద్యులచే నిర్ధారణ చేయబడిన ఒక 32 ఏళ్ల మహిళ సెప్టెంబర్ లో వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. రోగి యొక్క స్కాన్ రిపోర్టు లో 3mm, 6mm, 6.5mm and 8mm పరిమాణాలు గల నాలుగు రాళ్లు కనిపించాయి. ఆమె క్రింది సమస్యలతో బాధపడింది: తీవ్ర నడుము నొప్పి, వీపు నొప్పి, పాదాల్లో వాపు మరియు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది. ఆపరేషన్ చేయించుకోమని వైద్యులచే ఆమెకు సలహా ఇవ్వబడింది గాని ఆమె అంగీకరించలేదు. రోగి కీళ్ల నొప్పులతో కూడా బాధపడుతూ ఉండేది. ఒక సంవత్సరం నుండి ఆమె కాల్షియం తీసుకుంటూ ఉండేది.

2013 సెప్టెంబర్ 8 న ఆమెకు క్రింది కాంబోలను ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC13.5 Kidney stones + CC15.1 Mental & Emotional tonic…TDS

రోగి వైబ్రో చికిత్సను ప్రారంభించే ముందు అల్లోపతి మందులను తీసుకోవడం ఆపింది. రెండు నెలల తర్వాత 2013 నవంబర్ 3న రోగి తన కడాపటి స్కాన్ రిపోర్టును చికిత్సా నిపుణులకు చూపించింది. ఆ రిపోర్టు ద్వారా రోగికి మూత్రపిండాల్లో రెండు రాళ్లు మాత్రమే మిగిలాయని, వాటి పరిమాణం  4mm మరియు 5mm కి తగ్గిపోయిందని తెలిసింది. 2014 జనవరి 4 నాటికి మూత్రపిండాల్లో రాళ్లు పూర్తిగా తొలగిపోయాయని తెలిసింది. మందు యొక్క మోతాదు క్రమంగా OWకు తగ్గించబడింది. ఆరోగ్య సంరక్షణ కొరకు ఈ మోతాదులో మందును ఆరు నెలలకు రోగి తీసుకోవడం జరిగింది. రోగికి ఇప్పటివరకు రాళ్ళ సమస్య తిరిగి కలగలేదు.

సంపాదకుడి వివరణము:
ఈ రోగి కాల్షియం గోలీలను తీసుకునేది. ఈ గోలీల ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదము ఉందని కనుగొనపడింది. క్రింది లింక్ లో మూత్రపిండాల్లో రాళ్ళ నివారణకు ఉపయోగపడే సలహాలు ఇవ్వబడినాయి: 

http://www.mayoclinic.org/diseases-conditions/kidney-stones/basics/prevention/con-20024829.