మూత్రపిండ వైఫల్యం 11993...India
ఒక సంవత్సరం నుండి వారానికి మూడు సార్లు రక్తశుద్ధి చికిత్సను చేయించుకుంటున్న ఒక 44 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. అతను దీర్ఘకాలంగా బాధపడుతున్న ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలకు అనేక అల్లోపతి మందులపై ఆధారపడి ఉండేవారు. 2010లో రోగికి మూత్రపిండంలో వ్యాధి మొదలైంది. రెండు సంవత్సరాల తర్వాత అతని క్రియాటినిన్ స్థాయి 9కి పెరిగి రక్తశుద్ధి చికిత్స ద్వారా తగ్గించడం జరిగింది. రోగి చికిత్సా నిపుణులను సంప్రదించిన సమయంలో రోగి యొక్క రక్త పరిశోధన రిపోర్టుల ద్వారా మూత్రపిండ సంబంధమైన పారామితులు చాలా అధికంగా ఉన్నాయి.
రోగికి క్రింది కాంబోలను ఇవ్వడం జరిగింది:
CC12.1 Adult tonic + CC13.4 Kidney failure + CC15.1 Mental & Emotional tonic…6TD
రోగి వైబ్రో మందులతో పాటు అల్లోపతి మందులను తీసుకోవడం కొనసాగించారు. రెండు నెలల తర్వాత రోగి యొక్క క్రియాటినిన్ స్థాయి 3 నుండి 3 .5 కి తగ్గిపోయింది మరియు రక్తశుద్ధి చికిత్స వారానికి రెండు సార్లు మాత్రమే ఇవ్వబడింది. నెలా పదిహేను రోజుల గడిచాక రక్తశుద్ధి చికిత్స కేవలం వారానికి ఒక సారి మాత్రమే ఇవ్వవలసి వచ్చింది. 2014 జనవరి 1 నుండి రక్తశుద్ధి చికిత్స నెలకి ఒకసారి మాత్రమే ఇవ్వడం జరిగింది మరియు రోగి యొక్క క్రియాటినిన్ స్థాయి 2.5 నుండి 3 కి తగ్గింది. 2014 మార్చ్ 1 న క్రియాటినిన్ స్థాయి 1.9 కి తగ్గిపోవడం కారణంగా రక్తశుద్ధి చికిత్స చేసే అవసరం లేదని వైద్యులచే చెప్పబడింది. వైబ్రో మందు యొక్క మోతాదు క్రమంగా క్రింది విధముగా తగ్గించబడింది : 2014 మార్చ్ 1 నుండి ఒక నెల వరకు OW , ఆ తర్వాత రెండు నెలల వరకు నెలకు ఒకసారి. ఆ తర్వాత వైబ్రో మందు ఆపబడింది. 2016 ఆగస్టు నాటికి రోగి ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు.
క్రియాటినిన్ స్థాయిలపై సంపాదకుడి వివరణము:
రక్తంలో క్రియాటినిన్ యొక్క సాధారణ స్థాయి : మొగవారిలో సుమారు 0 .6 నుండి 1.2 mg /dl మరియు ఆడవారిలో 0.5 to 1.1 mg /dl ఆరోగ్యవంతమైన యువకులలో క్రియాటినిన్ స్థాయి సాధారణ స్థాయి కంటే అధికంగా ఉండవచ్చు. వృద్ధులలో క్రియాటినిన్ స్థాయి సాధారణ స్థాయి కంటే తక్కువై ఉండవచ్చు. శిశువులలో, కండరాల ఎదుగుదల బట్టి 0.2 లేదా దీని కంటే అధికంగా ఉంటుంది. పోషకాహారలోపం, శరీర బరువు తగ్గిపోవడం మరియు దీర్ఘకాలిక వ్యాధులు కారణంగా రక్తంలో వయస్సుకి తగిన క్రియాటినిన్ స్థాయి కంటే తక్కువ ఉండవచ్చు.