బ్రెస్ట్ క్యాన్సర్ 11993...India
బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధికి వరుసగా అల్లోపతి చికిత్సలను తీసుకొని మంచం పట్టిన ఒక 50 ఏళ్ల మహిళ యొక్క కుటుంభ సభ్యులు వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. 2013 మార్చ్ లో ఆమెకు క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించబడింది. ఆమెకు క్రింది చికిత్సలు చేయించడం జరిగింది: స్తనచ్ఛేదనం (ఒంటిప్రక్క), రేడియోథెరపి మరియు కీమోథెరపీ(రసాయనచికిత్స). మొదట్లో ఈ చికిత్సలు విజయవంతమైనట్లు అనిపించింది గాని క్యాన్సర్ తిరగబెట్టడంతో ఆమెకు పది కీమోథెరపీ సెషన్స్ ఇవ్వబడినాయి. ఈ చికిత్స యొక్క ప్రభావానికి తట్టుకోలేక ఆమె మంచానపడింది.
2013 సెప్టెంబర్ 1 న ఆమెకు క్రింది మిశ్రమాలతో చికిత్స ఇవ్వబడింది:
CC2.1 Cancers – all + CC2.2 Cancer pain + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…6TD
రెండు నెలల తర్వాత నవంబర్ 1న, ఆమె ఆరోగ్యస్థితి 50% వరకు మెరుగుపడింది. సహాయం లేకుండా రోగి నడవడం ప్రారంభించింది. నాలుగు నెలల తర్వాత 2014 జనవరి లో, ఆమె ఆరోగ్యం 75% మెరుగుపడింది. రోగి తన రోజువారీ పనులను చేసుకోగలిగింది. ఆరు నెలల తర్వాత మార్చ్ లో ఆమె ఆరోగ్యంలో 90% మెరుగుదల ఏర్పడింది. 2014 మేలో ఆమె క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుంది. ఆ సమయంలో చేసిన పరిశీలనలో క్యాన్సర్ వ్యాధి యొక్క జాడ కనిపించలేదు. క్రింది విధముగా రోగికి మందు యొక్క మోతాదు తగ్గించడం జరిగింది: ఒక నెల వరకు TDS, తదుపరి నెల BD, ఆపై ఆరు నెలలకు OD, ఆ తర్వాత OW, తర్వాత పదిహేను రోజులకు ఒకసారి. 2016 ఆగస్టు నాటికి ఆమె ఆరోగ్యంగా జీవిస్తోంది మరియు సంరక్షణ కొరకు వైబ్రో మందును నెలకి ఒకసారి తీసుకుంటోంది.