ఉబ్బు నరాలు, శ్వాసకోశ అలెర్జీ 11958...India
ఉబ్బు నరాల కారణంగా కలిగిన తీవ్రమైన నొప్పితో ఒక 30 ఏళ్ల మహిళ 2016 ఫిబ్రవరి 17న చికిత్స కొరకు వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఆమె ఒక సంవత్సరం నుండి ఈ సమస్యతో బాధపడుతున్నారు. తీవ్ర నొప్పి కారణంగా ఆమెకు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. రోగి యొక్క నానమ్మగారికి ఇదే రోగ లక్షణం ఉండేది కాబట్టి ఈ సమస్య రోగికి వంశానుగతంగా వచ్చియుండవచ్చు. ఆమెకు గత రెండు సంవత్సరాలుగా దుమ్ము అలెర్జీ కారణంగా రైనైటిస్ (నాసికయందలి మంట- వ్యాధి). ఆమెకు క్రింది రోగ లక్షణములు ఉండేవి : ముక్కు నుండి నీరు కారుట, తుమ్ములు మరియు గొంతు నొప్పి. ఈ సమస్య నుండి ఉపశమనం కొరకు ఆమె అంతకు ముందు హోమియోపతి చికిత్సను తీసుకోవడం జరిగింది గాని ఆమెకు ఉపశమనం కలగలేదు. క్రింది వైబ్రో మిశ్రమాలు ఆమెకు ఇవ్వబడినాయి:
ఉబ్బు నరాల సమస్యకు:
#1. CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
#2. CC3.7 Circulation…QDS నీటిలో కలిపి కాళ్ళపై పూత
శ్వాసకోశ అలెర్జీ సమస్యకు:
#3. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.7 Throat chronic…6TD
ఈ చికిత్సను తీసుకొనే సమయంలో ఆమె ఇతర మందులను తీసుకోలేదు. ఒక వారం తర్వాత రోగికి కాళ్ళ నొప్పులు 50 % తగ్గిపోయాయి. రెండు వారాల తర్వాత కాళ్ళ నొప్పులు 90% తగ్గాయి గాని ఇతర లక్షణాలలో (ముక్కు కారుట, తుమ్ములు మరియు గొంతు నొప్పి) 75% ఉపశమనం మాత్రమే కలిగింది. మార్చ్ 17న ఆమె కాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. #1 మరియు #2 కాంబోల మోతాదు BDకి తగ్గించబడింది. ఐదు వారాల తర్వాత ఆమె వైబ్రో మందులను తీసుకోవడం ఆపింది.
ఏప్రిల్ 10 న ఆమెకు రైనైటిస్ సమస్య నుండి పూర్తిగా (100%) ఉపశమనం కలిగింది. #3 యొక్క మోతాదు ఆపై మూడు వారాలలో క్రమంగా తగ్గించబడింది. 2016 మే లో ఆమెకు కాళ్ళ నొప్పి లేదా రైనైటిస్ సమస్యలు తిరిగి కలగలేదు.