పుట్టుకనుండి ఎక్జీమా (తామరవ్యాధి) 01180...Bosnia
పుట్టుక నుండి ఎక్జీమా అనబడే ఒక చర్మవ్యాధితో బాధపడుతున్న ఒక 12 ఏళ్ల బాలుడను 2015 అక్టోబర్ 14న చికిత్స కొరకు వైబ్రో చికిత్సా నిపుణుల వద్దకు తీసుకు రావడం జరిగింది. ఈ బాలుడు, పుట్టిన మూడవ రోజు నుండి ఈ చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. రోగి యొక్క శరీరం అంతయు ఈ వ్యాధి వ్యాపించి యుండడం కారణంగా రోగికి తీవ్రమైన అసౌకర్యం కలిగేది (చిత్రాలను చూడండి). చీము కారుతున్న తామర కారణంగా రోగికి తీవ్ర దురద మరియు మంట కలిగేది. ముఖ్యంగా తామర ఎండిపోయినప్పుడు చర్మం కూడా ఎండిపోయి పగుళ్లు ప్రారంభమయ్యేవి. దీని కారణంగా రోగికి తీవ్ర నొప్పి కలిగేది. గోకడం కారణంగా రోగి యొక్క శరీరం తీవ్రమైన నొప్పితో కూడిన పుళ్ళతో కప్పబడి యుండేది. ఈ బాలుడికి నాడీవ్రణములు (సైనస్లు) మూసుకు పోవడం కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉండేది.
ప్రారంభంలో రోగికి ఇవ్వబడిన మందులు:
#1. SR389 Kali Bic 30C…నాలుగు గంటలకు ఒకసారి (మూడు సార్లు). మరుసటి రోజు పుల్ అవుట్ ప్రక్రియ కారణంగా రోగి యొక్క వ్యాధి లక్షణాలు మరింత తీవ్రమవ్వడం జరిగింది (చిత్రం చూడండి).
వ్యాధి లక్షణాలు మరింత క్షీణించకుండా ఉండే నిమిత్తమై చికిత్సగా నిపుణులు క్రీములో క్రింది మిశ్రమాన్ని సిద్ధం చేశారు:
#2. CC10.1 Emergencies + CC12.2 Child tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.6 Eczema … TDS
*క్రింది పదార్థాలను ఉపయోగించి క్రీము తయారు చేయబడింది: కాచిన నెయ్య, కొబ్బరి నూనె, మైనం, కేలండ్యూలా నూనె, సీంఫైటం (ఒక విధమైన ఔషదం)నూనె మరియు విభూతి.
అదనంగా, నొప్పి గురించిన భయాన్ని తొలగించుటకు చికిత్సా నిపుణులు క్రింది మిశ్రమాన్ని ఇవ్వడం జరిగింది:
#3. SR543 Agaricus Mus 30C…OD అవసరమైనప్పుడు
అక్టోబర్ 27 న, రోగి యొక్క వ్యాధి లక్షణాలలో ఘనమైన మెరుగుదల కనిపించింది. అయితే రోగి యొక్క కంటి చుట్టూ తామర వ్యాధి లక్షణాలు మొదలవడం చూసిన చికిత్సా నిపుణులు క్రింది మందును ఇవ్వడం జరిగింది:
#4. SR249 Medorrhinum 30C… నాలుగు గంటలకు ఒకసారి (రోజుకి మూడు సార్లు).
చికిత్స ప్రారంభంలో రోగి యొక్క వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత మెరుగుదల కనిపించింది. నవంబర్ 7 న రోగికి నొప్పి చాలా వరకు తగ్గిందని రోగి తెలియచేసారు. పైపూత ముందుగా ఉపయోగించుటకు క్రీములో తయారు చేయబడిన మిశ్రమం నొప్పిని తగ్గించడానికి రోగికి ఎంతో సహాయపడింది. దీని కారణంగా రోగి బడికి వెళ్లి చదువుకో గలిగాడు (చిత్రాలను చూడండి).
.
చికిత్సా నిపుణులు క్రింది మందును ఇచ్చారు:
#5. SR218 Base Chakra…OW (వారానికి ఒకసారి,నాలుగు వారాలకు)
నవంబర్ 21 న, రోగికి క్రింది రోగ లక్షణాలు ఏర్పడ్డాయి: ముక్కులో తీవ్ర దురద, మూసుకున్న నాడీవ్రణములు మరియు ముక్కునుండి గట్టిగానున్న తెల్లటి చీమిడి కారుట. చికిత్సా నిపుణులు తిరిగి #1...OD తో పాటుగా క్రింది మిశ్రమాలను ఇవ్వడం జరిగింది:
#6. SR331 Bacillus-7…ఒక సారి
#7. SR333 B. Morgan…ఒక సారి
ఒక వారం తర్వాత, రోగి యొక్క చేతిమణికట్టు మరియు చెవుల పై చిన్న తెల్లటి మచ్చలను చికిత్సా నిపుణులు గమనించడం జరిగింది. దీనికి కారణం స్ట్రెప్టోకోకై (ఒక విధమైన బాక్టీరియా క్రిములు) అని అనుమానించి క్రింది మిశ్రమాన్ని రోగికి ఇచ్చారు:
#8. SR316 Strep…OD 21 రోజులకు మరియు ఏడు రోజుల విరామం తర్వాత మరో 21 రోజులకు OD
#9. NM101 Skin-H + NM102 Skin Itch…TDS
2016 ఫిబ్రవరి 11 న, రోగికి తామర వ్యాధి లక్షణాలు దాదాపు పూర్తిగాను, నొప్పి పూర్తిగాను తగ్గిపోయాయి మరియు రోగి యొక్క ఆకలి సాధారణ స్థాయికి చేరుకోవడంతో రోగి యొక్క ఆరోగ్యం మెరుగుపడింది.
రోగి యొక్క తల్లిగారు టాన్సిల్స్ పరీక్ష చేయించడంతో రోగి యొక్క టాన్సిల్స్ పై కేవలం 30% స్ట్రెప్టోకోకై మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిసింది. చికిత్సా నిపుణులు క్రింది మందును ఇచ్చారు:
#10. Sulphuricum Acidum 30C హోమియో స్టోర్స్ నుండి...నాలుగు గంటలకు ఒకసారి, మొత్తం మూడు డోసులు మరియు #8...OD 21 రోజులకు.
2016 మార్చులో, వైద్యుడు ఒక అద్భుతమైన రీతిలో, ఈ బాలుడి యొక్క వ్యాధి పూర్తిగా నయమయిపోవడం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు (చిత్రాలను చూడగలరు)