ప్రయాణం సమయంలో కలిగే తీవ్ర ఆరోగ్య సమస్య 03527...France
మూడేళ్ళ వయస్సు గల ఒక బాలుడు, తనకు 18 నెలల వయసు నుంచి, ప్రయాణాలు చేసే సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. కారు ప్రయాణం మొదలుపెట్టిన 10-20 నిమిషాలకు, ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యేవాడు. ఆ బాలుడు యొక్క ముఖం పాలిపోయి, వాంతులు మొదలయ్యేవి. ఈ సమస్యకు ఆ బాలుడికి ఏ విధమైన చికిత్స ఇవ్వబడలేదు. బాలుడి యొక్క అమ్మమ్మగారు వైబ్రో చికిత్స కొరకు ఒక చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. క్రింది మందు, 2016 ఏప్రిల్ 9 న, రోగికి ఇవ్వబడింది:
CC15.1 Mental & Emotional tonic + CC17.1 Travel sickness...తరచుగా ఈ మందును ఇవ్వమని చెప్పబడింది.
వoద మైళ్లకు పైగా ప్రయాణించ వలసిన ఒక సందర్భంలో,బాలుడి యొక్క అమ్మమ్మ గోలీల రూపంలో మందును ఇవ్వడానికి ఇష్టపడింది (సూచించబడినట్లుగా నీటిలో కాదు). ప్రయాణం ప్రారంభించడానికి ఒక గంట ముందు ఒక డోస్, ప్రయాణం మొదలైన వెంటనే ఒక డోస్, ఆపై ఒక గంట సమయం వరకు, పది నిమిషాలకు ఒక గోలి ఇవ్వడం జరిగింది. ఆ బాలుడికి, ప్రయాణం సమయంలో సాధారణంగా కలిగే ఆరోగ్య సమస్యలు కలుగలేదు. దీని కారణంగా వారు ఆనందంగా ప్రయాణించగలిగారు. వారికి 100% ఫలితాలు లభించడంతో, తిరుగు ప్రయాణంలో ఇదే పద్ధతిలో వైబ్రో గోలీలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాలుడి యొక్క తల్లి ప్రయాణాల సమయంలో, వైబ్రో మందులను బాలుడికి ఇవ్వడం కొనసాగించిన కారణంగా, బాలుడికి ప్రయాణం సమయంలో కలిగే ఆరోగ్య సమస్య పూర్తిగా తొలగిపోయింది.