చాలని తల్లిపాలు 03526...USA
తల్లిపాలు చాలక ఇబ్బందిపడుతున్న ఒక మూడు నెలల బిడ్డకు తల్లైన ఒక 24 ఏళ్ల మహిళ, వైబ్రియానిక్స్ గురించి తెలుసుకొని చికిత్సా నిపుణులను, సహాయం కొరకు సంప్రదించింది. ఆమె యొక్క చనుబాలు రోజురోజుకి తగ్గిపోవటం కారణంగా వైద్యుడు బిడ్డకు సీసా పాలు పట్టించమని సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మహిళ, బిడ్డకు తల్లి పాలివ్వడం కొనసాగించాలని ఆశ పడింది. ఆమె, మణికట్టు సంబంధించిన (కార్పల్ టన్నల్ సిండ్రోమ్) సమస్యతో కూడా బాధపడేది. దీని కారణంగా, ఆమెకు ఎడమ చేతిలో నొప్పి ఉండేది. నొప్పి నుండి ఉపశమనం కొరకు వైద్యుడుచే పెయిన్ కిల్లర్లు ఇవ్వబడినాయి.
ఆమె ఒక ఆరోగ్యకరమైన జీవనశైలీను పాటించేది మరియు ఆమె కుటుంబం ఆమెకు తగిన సహకారాన్ని అందించేది. బిడ్డ యొక్క సంరక్షణ కొరకు ఆమె తన ఉద్యోగాన్ని విడిచి పెట్టింది. క్రింది మిశ్రమాలు ఆమెకు ఇవ్వడం జరిగింది:
#1. CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis…TDS
ఒక వారం తర్వాత, బిడ్డకు సరిపోయే విధంగా చనుబాలు యొక్క సరఫరా పెరగడంతో ఆమె ఎంతో ఆనందించింది. నాలుగు వారాల తర్వాత ఆమె చికిత్సా నిపుణులను సంప్రదించి, మూడు రోజుల క్రితం వైబ్రో మందులు పూర్తయినట్లుగాను, అప్పటినుండి చనుబాలు యొక్క ఉత్పత్తి తగ్గడాన్ని ఆమె గమనించినట్లుగాను తెలిపింది. వెంటనే ఆమె చికిత్సా నిపుణులను వైబ్రో మందులను తిరిగి నింపి ఇవ్వమని కోరింది. మిశ్రమాల్లో కొంత మార్పు చేయడం జరిగింది. ఈ మహిళ తల్లిపాలు యొక్క ఉత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా, CC20.3 Arthritis ను చేర్చకుండా, క్రింది మిశ్రమాలను ఇవ్వడం జరిగింది:
#2. CC8.1 Female tonic + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS
ఈ మహిళ, బిడ్డకు 11 నెలలు పూర్తయ్యే వరకు పైన ఇవ్వబడిన వైబ్రో మిశ్రమాలను తీసుకోవడం జరిగింది. ఆపైన బిడ్డకు ఇతర ఆహార పదార్థాలను ఇవ్వడం ప్రారంభించింది.
చికిత్సా నిపుణుల వ్యాఖ్యానం:
వైబ్రియానిక్స్ చికిత్స ద్వారా ఎటువంటి ఫలితాలను ఎదురు చూడవచ్చో రోగికి ఖచ్చితంగా తెలియలేదు కానీ, ఆమెకు అద్భుతమైన ఫలితాలు లభించాయి. చెప్పలేని కారణాల వలన ఆమె తన చేతి నొప్పికి వైబ్రో చికిత్సను తీసుకోకుండా, వైద్యుడుచే ఇవ్వబడిన పెయిన్ కిల్లర్లను మాత్రము తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీని కారణంగా నేను కీళ్ల వాపుకి సంబంధించిన వైబ్రో మిశ్రమాన్ని నిలిపి వేయడం జరిగింది.