బెల్ పక్షవాతం 03529...UAE
2015 సెప్టెంబర్ 20న చికిత్సా నిపుణుడు ఆకస్మికంగా, 34 ఏళ్ళ వయసున్న తన సహచరుడుని చూసినప్పుడు, అతని ముఖం అసాధారణంగా ఉండడం గమనించింది. ఒక వైరల్ సంక్రమణ(ఇన్ఫెక్షన్) కారణంగా బెల్ పక్షవాతం కలిగి, రెండు వారాలుగా పనికి హాజరు కాలేకపోయానని చికిత్సా నిపుణురాలికి అతను చెప్పారు. తన ముఖంలో కలిగిన తీవ్ర వక్రతను గమనించిన వెంటనే వైధ్యుడను సంప్రదించడంతో, రోగికి కార్తికోస్టీరాయిడ్లు ఇవ్వబడినాయి. అయితే, ఈ మందుల ద్వారా ఉపశమనం కలగలేదు. అతను దవడ చుట్టూ నొప్పి, కంటి రెప్పపాటు, మాటలలో అస్పష్టత, తినడం లేదా తాగడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో భాధపడేవాడు. ఈ కారణంగా వైద్యుడు ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫిజియోథెరపీ మొదలుపెట్టమని సలహా ఇచ్చారు. చికిత్సా నిపుణురాలిని కలిసిన సమయంలో ఏ విధమైన మందులను అతను తీసుకోవడం లేదు. ఆమె ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న రోగి, వైబ్రో మందులను తీసుకోవడానికి వెంటనే అంగీకరించాడు. మరుసటి రోజునుండి రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC9.2 Infections acute + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC18.1 Brain disabilities + CC18.4 Paralysis…6TD
ఒక వారం తర్వాత, రోగికి 50% వరకు నయమై పోయింది. రోగి యొక్క మాటల్లో 70% మెరుగుదల, కంటి రెప్పపాటు సమస్యలో మరియు తినే లేదా త్రాగే సమయంలో కలిగే ఇబ్బందిలో 50% మెరుగుదల కలిగింది. దవడ నొప్పి 50% తగ్గిపోయింది. రోగి మందును తనకు సూచించ విధంగా 6TD మోతాదులో కాకుండా QDS మోతాదులో తీసుకుంటున్నట్లుగా రోగి ఒప్పుకున్నారు.
ఆపై మూడు వారాల తర్వాత వ్యాధి లక్షణాలన్నిటిలోను 80 శాతం నుండి 90 శాతం మెరుగుదల కనపడింది. ఇంత త్వరగా ఉపశమనాన్ని అనుభవించిన రోగి అల్లోపతి వైధ్యుడను సంప్రదించే అవసరం లేదా ఫిజియోథెరపి చేసే అవసరం లేదని నిర్ణయించుకొని వైబ్రో చికిత్సను కొనసాగించారు.
ఆపై రెండు వారాలకు రోగి 100 శాతం కోలుకున్నారు. ఈ కారణంగా మోతాదు OD కి తగ్గించబడి, 2015 నవంబెర్ 30 వరకు ఈ చికిత్స కొనసాగించ బడింది. 2016 మార్చ్ నాటికి అతను ఆరోగ్యకరంగా ఉన్నారు.