మదుమేహ సంభందిత దద్దుర్లు 03516...Canada
మూడు సంవత్సరాలకు పైగా, చర్మంపై మధుమేహం కారణంగా వచ్చిన ధద్దుర్లతో భాదపడుతున్న ఒక 66 ఏళ్ళ వ్యక్తి, 2015 జనవరి 15న చికిత్సా నిపుణుడను సంప్రదించారు. అనేక భాగాలలోనున్న దద్దుర్లు ఎర్రగాను మరియు చీముతో నిండినవిగాను ఉండేవి. అల్లోపతి వైధ్యులచే ఇవ్వబడిన వివిధ పైపూత మందుల ద్వారా ఉపశమనం కలగలేదు. ఈ రోగికి దురద మరియు నొప్పి కారణంగా చాలా ఇబ్బంది కలిగేది. స్వామి, వైబ్రియానిక్స్ చికిత్సా విధానాన్ని ఆశీర్వదించారని, చికిత్సా నిపుణుల ద్వారా తెలుసుకున్న ఈ రోగి, వెంటనే వైబ్రో మందులను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రోగి ఏ విధమైన పైపూత మందులను ఉపయోగించడం లేదు. మెట్ఫార్మిన్ (తక్కువ మోతాదు) ద్వారా మధుమేహం నియంత్రణలో ఉండేది.
ఈ రోగికి క్రింది మందులు ఇవ్వబడినాయి:
CC12.1 Adult tonic + CC14.1 Male tonic + CC21.3 Skin allergies + CC21.6 Eczema...TDS
మౌఖికంగా వైబ్రో మందును తీసుకోవడంతో పాటు, రోగికి, ఐదు గోలీలను 200ml ఆలివ్ నూనెలో కలిపి, ప్రతిరోజు ధద్దుర్లపై పైపూత మందుగా రాయవలసిందిగా చెప్పబడింది.
ఒక వారం తర్వాత దురదలు నుండి కొంత ఉపశమనం కలిగింది. ఒక నెల తర్వాత దురదలు 90% తగ్గిపోయాయి మరియు దద్దుర్లు 30 శాతం తగ్గాయి. రెండు నెలల తర్వాత దురదలు పూర్తిగా తగ్గి, దద్దుర్లు 50% తగ్గాయి. మూడు నెలల తర్వాత దద్దుర్లు 90% తగ్గిపోయాయి. క్రమముగా అతనికి దద్దుర్లు పూర్తిగా తగ్గిపోవడం కారణంగా మందు యొక్క మోతాదు OD గా తగ్గించ బడింది. అదే సమయంలో, వైబ్రో మందును పైపూతగా రాయడం కూడా ఆపారు. 2016 మార్చ్ నాటికి రోగికి దద్దుర్లు సమస్య తిరిగి రాలేదు.ఇప్పటికి అతను మందును రోజుకి ఒకసారి తీసుకోవడం కొనసాగిస్తున్నారు.