నోటిపుండ్లు 11965...India
28-సంవత్సరాల మహిళ గత మూడు రోజులుగా నోటి పండ్ల తో బాధపడుతూ 2014 డిసెంబర్ 18 వ తేదీన ప్రాక్టీషనర్ ను కలిసారు. ఈ పుండ్లు ఎంత బాధ కలిగిస్తున్నాయంటే ఆమెకు తినడం త్రాగడం కూడా ఇబ్బందిగా ఉంది. ఇలా రావడానికి ప్రత్యేక కారణమంటూ ఏమిలేదు అంతేగాక ఆమె దీనినిమిత్తం మందులు కూడా ఏమీ వాడడం లేదు. ప్రాక్టీ షనర్ ఆమెకు క్రింది రెమిడి ఇవ్వడం జరిగింది :
NM89 Mouth and Gum... నీటితో ప్రతీ ప్రతీ 10 నిమిషాలకు ఒక డోస్ చొప్పున 2 గంటల వరకు
రెండుగంటల తర్వాత పేషంటు తాను ద్రవపదార్ధాలు తీసుకోగలుగు తున్నానని చెప్పారు. డోసేజ్ ను 6TD కి తగ్గించడం జరిగింది.ఆ తరువాత ఉదయానికి పేషంటు యొక్క పరిస్థితి మరింత మెరుగుపడి ఆమె తన నోటి యొక్క కుడి భాగము నుండి ఏదయినా తినగలుగు తున్నారు. ఆరోజు సాయంత్రానికి సాధారణ స్థితికి చేరుకొని నోటికి ఇరు ప్రక్కలా తినగల పరిస్థితి కలిగింది. డిసెంబర్ 20 నాటికి డోసేజ్ ను TDS కు తగ్గించడం జరిగింది. తరువాత రెండు రోజులకు అల్సర్ పూర్తిగా తగ్గిపోయింది. మరికొన్ని రోజులు రెమిడి ని OD తీసుకోవాల్సిందిగా పేషంటు సూచించబడ్డారు.