అధిక బరువు, సక్రమంగా రాని నెలసరి,సంతానలేమి 02806...Malaysia
2014 ఫిబ్రవరి 20 వ తేదీన 28 సంవత్సరాల మహిళ స్థూలకాయం సమస్యతో ప్రాక్టీ షనర్ ను కలిసారు. ఆమె ఎత్తు 168 సెం.మీ.లేదా 5 అడుగుల 5ఇంచులు in, బరువు 88 కేజీలు /194lb మరియు బాడి మాస్ ఇండెక్స్ (BMI) 31.6. ఈమె గత సంవత్సర కాలంగా సక్రమంగా రాని నెలసరి తో కూడా బాధపడుతున్నారు. వీటి నిమిత్తము ఏ మందులు వీరు తీసుకోవడంలేదు. ఐతే అనుభవం కలిగిన హోమియో వైద్యులు కనుక అధిక బరువు వల్ల నెలసరి సమస్యలు ఏర్పడుతాయని తన స్థూలకాయం సమస్యను పోగొట్టుకోవాలని భావించారు.
స్థూల కాయానికి :
#1. CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders...TDS
మూడువారాలు అయ్యేసరికి ఆమె తనబరువును 4.5kg/10lb, కోల్పోయారు కానీ ఆమెకు అలసట, నీరసం కలగసాగాయి. కనుక రెమిడి ని క్రింది విధంగా మార్చడం జరిగింది.
నీరసానికి,స్థూలకాయమునకు :
#2. CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + #1...TDS
నాలుగు వారాలలో వీరికి మెల్లగా గుణం కనబడి ఆమె చురుకుగా శక్తివంతంగా తయారయ్యారు. 2014 జూలై 3 నాటికి వీరు 7kg/15.4lb బరువును కోల్పోయారు.కానీ వీరికి నెలసరి మాత్రం ఇంకా సక్రమంగా రావడంలేదు. కనుక వీరికి అదనంగా క్రింది రెమిడి ఇవ్వబడింది.
నెలసరి సక్రమము గా రావడానికి :
#3. CC8.8 Menses irregular...TDS
ఈ పేషంటుకు వివాహము జరిగి రెండేళ్లయినా సంతానము లేదు. వీరు స్పెషలిస్ట్ ను సంప్రదించగా వీరి యొక్క ఒక అండాశయము సాధారణ స్థాయి కన్నా తక్కువ పరిమాణము లో ఉన్నదని చెప్పారు. వీరి యొక్క ఇతర ప్రత్యుత్పత్తి అంగాలు మరియు వీరి భర్త యొక్క వీర్య పరిమాణము కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. వీరు సంతాన సాఫల్యం కోసం ఎట్టి చికిత్సా కూడా తీసుకోలేదు. దంపతులిరువురికి సంతానము కోసం రెమిడి ఇవ్వబడింది.
భార్యకు :
#4. CC8.1 Female tonic...TDS
భర్తకు :
#5. CC14.1 Male tonic + CC14.3 Male infertility...TDS
2014 అక్టోబర్ 1 వ తేదీన వీరు ప్రాక్టీషనర్ కు ఫోన్ చేసి తాను ప్రస్తుతం 7 వారాల గర్భవతి నని ఆనందంతో చెప్పారు. తాను తీసుకుంటున్న రెమిడి లన్నింటిని మానేసారు కానీ 4 వారాల తర్వాత వీరికి కలిగిన వికారము నాకు ప్రాక్టీ షనర్ ను సంప్రదించడం జరిగింది. వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :
గర్భం దాల్చడానికి మరియు వికారానికి :
#6. CC8.2 Pregnancy tonic + CC8.9 Morning sickness + CC12.1 Adult tonic...TDS